‘ఆధిపత్యం కోసమే రౌడీ షీటర్ ఖాసిం హత్య’

10 Aug, 2018 14:34 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న సీపీ మహేష్‌చంద్ర లడ్డా

సాక్షి, విశాఖపట్నం : ఆధిపత్య పోరే రౌడీ షీటర్‌ ఖాసిం హత్యకు కారణమని కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా పేర్కొన్నారు. ఆగస్టు రెండో తేదీన జరిగిన ఈ హత్య కేసును ఛేదించిన సీపీ మహేష్‌చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడారు.. ఆధిపత్యం ‍కోసమే రౌడీ షీటర్‌ ఖాసింను హత్య చేశారని, ఈ హత్యకు ముందు అతని అనుచరుడు బతిన మురళిని హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారని. అయితే అతడు రాకపోయే సరికి మళ్లీ డైమండ్‌ పార్క్‌ సాయిరామ్‌ పార్లర్‌ వద్ద రెక్కీ నిర్వహించారని, వాహనాలతో వెంబడించి ఖాసింను హతమార్చారని ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో నిందితులైన మెరుగు చిట్టి బాబు అలియాస్‌ చిట్టి మాము, అంబటి అంబటి మధుసూదన్ రావు అలియాస్ ఋషికొండ మధు, గుడ్ల వినోద్ కుమార్ రెడ్డి అలియాస్ రామాటాకీస్ వినోద్, శీలం సతీష్, సయ్యద్ రెహాన్ అలియాస్ మున్నా, చొప్పా హేమంత కుమార్, గతడ శ్రీనివాసులు ఉన్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి ఒక పిస్టల్‌, రెండు రౌండ్ల బుల్లెట్లు, ఆటో, ఆరు పదునైన కత్తులు, ఒక స్టీల్‌ రాడ్‌, కారంపోడి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్నూలులో ‘శంకర్‌దాదా’

మరో ఏడుగురు బాలికలకు విముక్తి

‘కమీషన్‌’ కేటుగాళ్లు అరెస్ట్‌!

తిరుమలలో అమానుషం

తిరుపతి: పెళ్లికి పోతే దోచుకున్నారు !

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మెడల్‌పై గురి

మెట్రోలో ఎవరుంటారు?

టైటిల్‌ కమింగ్‌ సూన్‌

అది శాశ్వతం కాదు

డేట్‌ ఫిక్స్‌ చేశారు వోబా

తొలి ప్రేమ గుర్తొస్తుంది