ఇందూరు దొంగ ఓరుగల్లులో చిక్కాడు

3 Nov, 2019 08:38 IST|Sakshi
గంజాయితో పట్టుబడిన నిందితులను చూపిస్తున్న వరంగల్‌ పోలీసు అధికారులు

జిల్లా గంజాయి స్మగ్లర్‌ను పట్టుకున్న వరంగల్‌ పోలీసులు  

గంజాయితో పారిపోతుండగా దొరికిన వ్యాపారి  

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాకు చెందిన గంజాయి స్మగ్లర్‌ వరంగల్‌ జిల్లా పోలీసులకు పట్టుపడ్డాడు. నిజామాబాద్‌ నుంచి నేరుగా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు వరంగల్‌ పోలీసులు వెల్లడించారు. గతంలో గంజాయి అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతూ కొందరి కేసులు, పీడీయాక్టు నమోదు చేశారు. అయినా జిల్లా నుంచి గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. వరంగల్‌ పోలీసులకు శుక్రవారం జిల్లాకు చెందిన గంజయివాలా రూ.30 లక్షల గంజాయిని మహారాష్ట్రకు సరఫరా చేస్తూ హసన్‌పర్తి పోలీసులకు చిక్కాడు. దీంతో అక్కడి పోలీసులు గంజాయి వాలాపై గతంలో నిజామాబాద్‌లో ఇంకా ఏవైనా కేసులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. మరో వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఇద్దరు గంజాయివాలాలు జిల్లా కేంద్రం నుంచి నాందేడ్‌కు వాహనాలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్‌ సోహైల్‌ కారులో గంజాయి రవాణా చేస్తున్నట్లు అక్కడి పోలీసుల విచారణలో తేలింది.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎంను హత్య చేయాలంటూ వీడియో.. వ్యక్తి అరెస్ట్‌!

కరోనా: ప్రముఖ బ్యాట్స్‌మన్‌ టీషర్ట్‌ వేలం!

విద్యార్థినిని ప్రేమ పేరుతో..

కరోనా: హిట్‌ మ్యాన్‌ భారీ విరాళం!

పోలీసులు విచారణకు వెళ్తే..

సినిమా

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు