మంచినీటి ట్యాంకరు బీభత్సం

1 May, 2019 11:21 IST|Sakshi
బ్రేకులు ఫెయిలైన జీవీఎంసీ వాటర్‌ ట్యాంకరు ప్రమాదంలో నుజ్జయిన కారు

బ్రేకులు ఫెయిలై కారు మీదకు దూసుకొచ్చిన వైనం

అదృష్టవశాత్తు తప్పినపెను ప్రమాదం

విశాఖపట్నం, భీమునిపట్నం: మంచినీటి ట్యాంకరు వాహనానికి బ్రేకులు ఫెయిల్‌ కావడంతో బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భీమిలి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నుంచి ఎగువపేట వైపు దిగుతున్న జీవీఎంసీ మంచినీటి ట్యాంకరు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అతివేగంగా క్రిందకు దూసుకొచ్చింది. ఎగువపేట వేదిక వద్దకు వచ్చి వైజాగ్‌కు చెందిన ఓ వ్యక్తి నూకాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వచ్చి పార్కు చేసిన కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రోడ్డు›మీద కూడా ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే గతంలో ఇదే ప్రదేశంలో ఒక జీపు అదుపు తప్పడంతో ఇద్దరు చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రాణాపాయం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

మరిన్ని వార్తలు