చంపడానికి వెళుతూ...దొరికిపోయారు..

23 Mar, 2018 13:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌ : ప్రేయసిని వేధిస్తున్నవారిని చంపడానికి వెళ్తుండగా ఇద్దరు యువకులు పోలీసులకు దొరికిపోయారు. వివరాలు.. ఈ నెల 21న ఎల్బీ నగర్ పోలీస్లు సాగర్ రింగ్ రోడ్డు అలేక్య టవర్స్‌ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అలీ రషీద్‌, మీర్జా మోహసీన్‌ అనే ఇద్దరు యువకులు పల్సర​ బైక్‌పై గుర్రంగూడ వైపు వెళ్తుండగా పోలీసులు అనుమానంతో వారిని ఆపారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌ని చూపించాలని అడగడంతో అలీ రషీద్ తన వద్ద మూడు కత్తులతో ఉన్న బ్యాగ్‌ని వదిలేసి పారిపోయాడు. పోలీసులు అప్రమత్తమై అక్కడే ఉన్న మరో యువకుడు మీర్జా మోహసీన్‌ని అదుపులోకి తీసుకున్నారు.

స్టేషన్‌కు తరలించి విచారించగా తన ప్రేయసిని వేధిస్తున్న ఆసిఫ్‌, ఫయాజ్‌ అనే ఇద్దరు వ్యక్తులను చంపడానికి గుర్రంగుడా వైపు వెళ్తున్నామని తెలిపారు. దీంతో ప్రధాన నిందితుడు కోసం బృందాలుగా ఏర్పడి అలీ రషీద్ నివాస ప్రాంతం శాలిబండ వద్ద పహారా కాసి చాకచక్యంగా ఈ నెల 22న పట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుంచి మూడు కత్తులు, ఒక పల్సర్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు