అర్థరాత్రి అలజడి.. వైట్నర్‌ మత్తులో..

24 Oct, 2018 17:06 IST|Sakshi
సంఘటనకు సంబంధించిన చిత్రాలు

సాక్షి, హైదరాబాద్‌ : అర్థరాత్రి సమయంలో వైట్నర్‌ మత్తులో ఉన్న కొంతమంది అలజడి సృష్టించారు. పూర్తిగా వైట్నర్‌ మత్తులో మునిగిన వాళ్లు ఒకరిపై ఒకరు కత్తులతో, బ్లేడ్లతో దాడి చేసుకుని జనాలను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ సంఘటన పాతబస్తీలోని ఫలక్‌నామా ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం అర్థరాత్రి వేళ ఫలక్‌నామాలో వైట్నర్ల మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు, కొందరు పురుషులు ఒకరిపై ఒకరు కత్తులతో, బ్లేడ్లతో దాడిచేసుకున్నారు.

మత్తులో మునిగిన ఓ మహిళ బ్లేడ్‌తో నరాలు కోసుకోవటంతో అక్కడి జనం భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఏసీపీ అబ్దుల్‌ రషీద్‌ మాట్లాడుతూ.. వైట్నర్ల మత్తు కారణంగానే వాళ్లు వీరంగం సృష్టించారని తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు