ముద్దివ్వబోతే భర్త నాలుక కొరికి..

24 Sep, 2018 11:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముద్దిచ్చేందుకు ముందుకొచ్చిన భర్తను ఇదే అదనుగా భావించిన భార్య అతడి నాలుకను కొరికేసింది. గొడవకు దిగిన భార్యను శాంతింపచేసేందుకు భర్త చేసిన ప్రయత్నం అతడి నాలుకకు ఎసరు తెచ్చింది. ఢిల్లీలోని రన్హోలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టిస్ట్‌గా పనిచేసే కరణ్‌కు రెండేళ్ల కిందట వివాహమైనా భార్యతో సఖ్యత లేదు. ఇద్దరూ తరచూ గొడవ పడుతుంటారని పోలీసులు తెలిపారు. భర్త అందంగా లేడని ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కరణ్‌ భార్య వాపోతుంటుందని స్ధానికులు చెబుతున్నారు.

వీరి మధ్య శనివారం రాత్రి సైతం  ఘర్షణ జరిగింది. కోపంతో ఉన్న భార్యను శాంతింపచేసేందుకు కరణ్‌ ముద్దు ఇవ్వగా అతడి నాలుకను సగం వరకూ ఆమె కొరికేసింది. బాధితుడి తం‍డ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపుతోకి తీసుకున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా బాధితుడు మాట్లాడే అవకాశం లేదని సప్ధర్‌జంగ్‌ ఆస్పత్రిలో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు