భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం

14 Apr, 2018 07:28 IST|Sakshi
భార్య మృతదేహం వద్ద విషన్నవదనంలో అశోకన్‌

బైక్‌ను ప్రభుత్వ బస్సు ఢీకొనడంతో ప్రమాదం

అన్నానగర్‌: ప్రభుత్వ బస్సు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య మృతి చెందింది. ఈఘటన నాగర్‌కోవిల్‌లో గురువారం జరిగింది.  వివరాలు.. కన్యాకుమారి జిల్లా కలియక్కావిలైకి చెందిన అశోకన్‌(51) కార్మికుడు. ఇతని భార్య వీజీ సహాయ(45). దంపతులు పేచ్చిపారై పల్లిముక్కు గ్రామంలో నివశిస్తున్నారు. వీరికి ఆకాష్‌ జోసఫ్‌ (13), అజయ్స్‌ జోసఫ్‌ (10) ఇద్దరు కుమారులున్నారు. గురువారం మధ్యాహ్నం నాగర్‌కోవిల్‌ ఒళుగినచేరి ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు అశోకన్, భార్య వీజీ సహాయ బైక్‌పై వెళుతున్నారు.

పార్వతిపురం సమీపం కట్టయన్‌విలై విద్యుత్‌ శాఖ కార్యాలయం వద్ద వెళుతుండగా ఎదురుగా వచ్చిన ప్రభుత్వ బస్సు బైకును ఢీకొంది. కిందపడిన వీజీ సహాయపై బస్సు చక్రం ఎక్కడంతో భర్త కళ్లెదుటే విషాదంగా మృతిచెందింది.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వీజీ సహాయ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆచారిపళ్లం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి బస్సు డ్రైవర్‌ రూబన్‌ (44)ను అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు