భార్య తలవంపులు తెస్తోందని..

20 Jun, 2018 13:34 IST|Sakshi
చికిత్స పొందుతున్న  శ్రీనివాసులు 

భర్త ఆత్మహత్యా యత్నం

సాక్షి, మదనపల్లె క్రైం : భార్య చెడు తిరుగుళ్లతో తలవంపులు తెస్తోందని ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సీటీఎం పంచాయతీ నల్లగుట్లపల్లెకు చెందిన పీట్ల శ్రీనివాసులు(32) మార్బల్‌ పనులు చేస్తూ భార్యా ఇద్దరు కుమార్తెలను పోషించు కుంటున్నాడు. అయితే ఇంటిపట్టునే ఉంటున్న భార్య జ్యోతి గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో చనువుగా ఉంటూ భర్తను పట్టింకుకోక పోవడంతో మందలించాడు.

దీంతో ఆమె అలిగి భర్తను వదిలి ఎనిమిది నెలల క్రితం అదే ఊరులో ఉన్న పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుంచి తనకు పరిచయం ఉన్న వ్యక్తితో మరింతగా చనువుగా ఉంటోంది. జ్యోతి తీరుకు గ్రామంలో భర్త తలెత్తుకు తిరగలేక అవమానానికి గురయ్యాడు. అంతే కాకుండా ప్రియుడి మాటలు విని ఆమె స్థానిక రూరల్‌ పోలీసులకు అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాసులును స్టేషన్‌కు పిలిపించడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. జీవితంపై విరక్తి చెందిన అతను సోమవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు శ్రీనివాసులును ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు