భర్తను కిడ్నాప్‌ చేయించిన భార్య 

30 Nov, 2019 09:12 IST|Sakshi

 నిందితురాలితో సహా ముగ్గురి అరెస్ట్‌

సాక్షి, బెంగళూరు:  కట్టుకున్న భర్తను కిడ్నాప్‌ చేయించిన భార్యను, ఆమెకు సహకరించిన ఆరుగురు వ్యక్తుల్లో ఇద్దరిని  దావణగెరె పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే దావణగెరె తాలూకా లోకికెరెలో  శ్రీనివాస్, సంగీతాళ దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్‌కు దావణగెరెలో భూమి, పెట్రోల్‌ బంక్‌ ఉంది. కొద్ది రోజుల క్రితం ఎస్‌ఐతో గొడవ పడిన సంగీతాళ విషం తాగింది. ఈ ఘటనపై కేసు నడుస్తోంది. మరో వైపు డబ్బు సమస్య ఎక్కువ కావటంతో భర్తను కిడ్నాప్‌ చేయించాలని పథకం పన్నింది.  ఇందుకు ఆరుగురు వ్యక్తులతో కలిసి పథకం రచించింది.

పెట్రోల్‌ బంక్‌ నుంచి ఇంటికి వెళ్తున్న శ్రీనివాస్‌ను నిందితులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి  సంగీతాళ ఫోన్‌ కాల్‌డాటాను సేకరించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా కిడ్నాప్‌ ఉదంతం వెలుగు చూసింది. దీంతో సంగీతాళతోపాటు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి శ్రీనివాస్‌ను రక్షించారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలింపు చేపట్టారు. 

మరిన్ని వార్తలు