భార్య గొంతు కోసి హత్య

26 Apr, 2018 11:53 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఏసీపీ శ్యామ్‌సుందర్‌

రాజేంద్రనగర్‌ : భార్యతో గొడవపడిన భర్త కత్తితో గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గండిపేట ప్రాంతానికి చెందిన గౌస్‌మోహీన్‌(35), గోల్కొండకు చెందిన షాహీన్‌బేగం(31)తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించి మూడు సంవత్సరాల క్రితం మృతిచెందాడు. వీరు గండిపేట మండల కార్యాలయం ప్రాంతంలో తన సొంత ఇంటిలో ఉంటున్నారు.

మోహీన్‌ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహించే వాడు. గత మూడు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఉద్యోగ విషయమై రోజూ షాహీన్‌బేగం, మోహీన్‌ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కూడా వీరిద్దరూ గొడవపడ్డారు. కాగా బుధవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పక్కింటి వారు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా మంచంపై షాహీన్‌బేగం మృతిచెంది ఉంది. కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లుగా ఉంది. కత్తి పక్కనే ఉండడం.. మంచంపై పెనుగులాట జరిగిన అనవాళ్లు కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న గోడలపై నెత్తురు మరకలు పడి ఉన్నాయి. సంఘటనకు ముందు ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

రాత్రి నుంచి మోహీన్‌ జాడ లేకపోవడంతో అతడిపైనే అనుమానాలు ఉన్నాయ  పోలీసులు తెలిపారు. డాగ్‌ స్వా్కడ్‌ను రప్పించిన పోలీసులు ఇంటి నుంచి రోడ్డుపై వరకు వెళ్లి ఆగిపోయాయి. రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.     

మరిన్ని వార్తలు