వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

16 Oct, 2019 11:02 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

ప్రియుడితో కలిసి భర్త హత్య

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

ఎల్‌బీనగర్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళతో పాటు, ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. మంగళవారం ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా, తండాకు చెందిన ఇస్లావత్‌ ప్రసాద్‌బాబు, సరోజ దంపతులు నగరానికి వలసవచ్చి ఇంజపూర్‌లో  నివాసం ఉంటున్నారు. ప్రసాద్‌ బాబు ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండగా, సరోజ వెలుగు ప్రాజెక్ట్‌లో బుక్‌ కీపర్‌ పనిచేసేది. దీనికితోడు ప్రసాద్‌ బాబు  చిట్స్‌  వ్యాపారం చేసేవాడు.  వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల పాలయ్యాడు. అప్పుదారులు ఇంటికి వస్తుండటంతో అతను ఇంటికి రాకుండా స్నేహితుల వద్దే తలదాచుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్న నర్సింహ్మతో  సరోజకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయం తెలియడంతో ప్రసాద్‌ బాబు గత కొద్ది రోజులుగా సరోజను కొడుతున్నాడు.

దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె ఈ విషయాన్ని తన ప్రియుడు నర్సింహకు విషయం చెప్పింది. పథకం ప్రకారం ఈ నెల 6న  నర్సింహ తన బంధువు అయాన రామకృష్ణకు విషయం చెప్పి అతడిని ప్రసాద్‌ ఇంటికి తీసుకువచ్చాడు. ఇద్దరిని సరోజ భర్తకు పరిచయం చేసి పైనాన్స్‌ ఇచ్చేందుకు వచ్చినట్లు తెలిపింది. అనంతరం అందరూ కలసి మద్యం తాగారు. పథకం ప్రకారం మద్యం మత్తులో ఉన్న ప్రసాద్‌ బాబు మెడకు టవల్‌తో ఉరి బిగించి హత్య చేశారు.  నర్సింహ్మ, రామకృష్ణ అక్కడి నుంచి వెళ్లి పోయారు. 7న ఉదయం తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని సరోజ తన సోదరుడు లక్ష్మణ్‌తో పాటు బంధువులకు సమాచారం అందించింది. అందరూ కలిసి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించారు. అయితే బంధువుల్లో కొందరు ప్రసాద్‌ బాబు మెడకు ఉరిబిగించిన గుర్తులను చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సరోజను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. మంగళవారం ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్ధలిపురం ఏసీపీ శంకర్, సీఐ వెంకటయ్య సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కత్తులతో ఒకరిపై ఒకరు దాడి

అమెజాన్‌ డెలివరీ ఏజెంట్ పై కేసు

ఏసీబీకి చిక్కిన జూనియర్‌ అసిస్టెంట్‌

తీర్థయాత్రలో కన్నీటిసుడి

ఉద్యోగిపై యజమాని దాడి

మహిళ దారుణ హత్య

గంగ కాలువపై సెల్ఫీ తీసుకుంటూ యువకుడి గల్లంతు

‘5 నిమిషాల్లో 3 హత్యలు; అదంతా కట్టుకథ’

విషం కలిసిన కూల్‌డ్రింక్‌ తాగిన చిన్నారులు

ఒకే రాత్రి ఆరు హత్యలు

కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదులు

దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య

వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

వీఎమ్‌సీ సర్కిల్ కార్యాలయాలపై ఏసీబీ దాడి

కన్న బిడ్డలను కాల్చి చంపిన తల్లి!

పగటిపూట దొంగతనాలు.. బుడత బ్యాచ్‌కు చెక్‌!

బాలుడి ప్రాణం తీసిన నాటువైద్యం

లిప్‌లాక్‌ చేసి.. నాలుక కట్‌ చేశాడు

సరూర్‌నగర్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు

మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరో షాక్‌

కబీర్‌సింగ్‌ ఎఫెక్ట్‌.. యువతిని చంపిన టిక్‌టాక్‌ స్టార్‌

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహ​​​​​​​త్యాయత్నం

అందుకే ఆ ముగ్గురినీ చంపేశాడు!

యువతి అనుమానాస్పద మృతి

హిందూపురం రైలు పట్టాలపై మృతదేహాలు..

అక్రమ నిర్మాణాలపై బల్దియా కొరడా

ఎయిర్‌టెల్‌ సంస్థ సీఈఓనని ‘ఫ్యాన్సీ’ వల

జియో లాటరీ పేరుతో లూటీ!

రైలు కిందపడి యువతి మృతి

అక్కడ చోరీ ...ఇక్కడ విక్రయం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!

నేటి నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు

జాన్వీ డౌట్‌

డెబ్భై నిండిన డ్రీమ్‌ గర్ల్‌

ఖైదీ యాక్షన్‌

అతిథి వస్తున్నారు