అడ్డొస్తున్నాడని అంతమొందించింది

22 Feb, 2019 12:21 IST|Sakshi
మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసులు

అనంతపురం, ఓడీ చెరువు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన ఓ మహిళ కట్టుకున్న భర్తను ప్రియుడితోపాటు మరోవ్యక్తితో కలిసి అంతమొందించింది. నేరం తనపైకి రాకుండా అనుమానాస్పద కేసుగా చిత్రీకరించింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. కదిరి డీఎస్పీ శ్రీనివాసులు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలను వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన తంబాల పెద్ద ఆదెప్ప(35) తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో భార్య రమాదేవి అదే గ్రామానికి చెందిన మంజునాథ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించాలని ప్రియుడు మంజునాథ్‌తో కలిసి పథకం రచించింది.

ఇందుకు చరణ్‌ అనే మరో వ్యక్తిని సాయం కోరింది. ఈమేరకు చరణ్‌ ఈ నెల 18న రాత్రి(సోమవారం) మద్యం సేవిద్దామని చెప్పి పెద్ద ఆదెప్పను మండల కేంద్రంలోని చెరువులోకి పిలుచుకెళ్లాడు. అక్కడ పూటుగా మద్యం తాపాడు. ఇంతలో మంజునాథ్, రమాదేవి అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న పెద్ద ఆదెప్పను ముగ్గురూ కలిసి గొంతు, మర్మావయవాలు నులిమి చంపేశారు. తర్వాత ఏమీ ఎరగనట్లు ఇంటికి చేరుకున్నారు. మంగళవారం మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లమాడ సీఐ నరసంహారావు, ఎస్‌ఐ ఫణిధర్‌కుమార్‌రెడ్డి  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్ని గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.  సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేసి నిందితుల్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును రెండు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహారావు, ఎస్‌ఐ ఫణిధర్‌కుమార్‌రెడ్డిని డీఎస్పీ అభినందించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పవన్‌కల్యాణ్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు 

చంద్రబాబు నివాసం సమీపంలో ఘోర ప్రమాదం

వైఎస్‌ వివేకా హత్య కేసు: వారిపై చర్యలు తీసుకోండి

కుమార్తెను హతమార్చిన తల్లి అరెస్ట్‌

రక్తపుటేరులు

వెంకటేశ్వర్లు హత్యకు కుట్ర.. ఇది వారి పనే!

రోడ్డు ప్రమాదంలో యువ దర్శకుడు దుర్మరణం

ఓటేస్తూ యువకుడి సెల్ఫీ

నెత్తురోడిన రహదారులు

క్రీడల్లో ప్రతిభావంతులు.. సరదా కోసం వాహనాల చోరీలు

ఏడుతో ఆపి ఆరు ‘అవతారాలు’...

ఆ ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు.. అందుకే..

డబ్బుల వివాదమే కారణం..

పసిమొగ్గలను చిదిమేస్తున్నారు..

బస్సు ఢీకొని విద్యార్థిని దుర్మరణం

డ్రిల్లింగ్‌ మెషీన్‌, కుక్కర్లలో బంగారు కడ్డీలు..

‘క్రికెట్‌ ఆపెయ్యండి .. కావాలంటే  పాకిస్తాన్‌ వెళ్లిపోండి’

అమ్మాయితో అఫైర్‌ పెట్టుకున్నాడనీ..

పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోనే చోరీ

వైద్యుడిపై పోలీస్‌ ఆఫీసర్‌ దాడి..!

నటి శ్రీరెడ్డిపై దాడి

మా నాన్న హత్యపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య

చిన్నారిని రేప్‌ చేసి చంపిన క్రూరుడు

పండుగపూట విషాదం 

120 కిలోల బంగారం పట్టివేత

తిరునాళ్లకు వచ్చి.. మృత్యుఒడికి

మృత్యు మలుపులు..!

మృత్యువులోనూ వీడని.. చిన్నారి స్నేహం  

పరీక్షకు వెళుతూ.. మృత్యు ఒడికి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నెక్ట్స్‌ ఏంటి?

బిజీ బిజీ

స్టైలిష్‌ రాయుడు

సస్పెన్స్‌.. హారర్‌.. థ్రిల్‌

తలైవి కంగన

ఆ వార్తల్లో నిజం లేదు