పెళ్లైన 20 రోజులకే భర్తను సజీవదహనం చేసిన భార్య

3 Aug, 2019 07:13 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రేమ వివాహం చేసుకున్న భర్తను పెళ్లైన 20 రోజులకే ఓ భార్య సజీవదహనం చేసింది. నిద్రిస్తున్న భర్తతో పాటు ఇంటిని కూడా తగల బెట్టేసింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనంలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టీవీ నగర్‌కు చెందిన దక్షిణా మూర్తి, మారియమ్మాల్‌ దంపతుల దత్త పుత్రుడు సేతుపతి దిండివనంకు చెందిన మురుగవేణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహమై 20 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సేతుపతి ఇళ్లు తగల బడుతుండడాన్ని స్థానికులు గుర్తించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది శ్రమించి మంటల్ని అదుపు చేశారు. ఇంటి బయట గడియపెట్టి ఉండడం, లోపల సేతుపతి సజీవ దహనమైన పడిఉండడం, మురుగవేణి కనిపించకపోవడంతో అనుమానాలు నెలకొన్నాయి.

దిండివనంలో తల్లి కుముదాతో ఉన్న మురుగవేణిని శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా భర్తను సజీవ దహనం చేసి అగ్ని ప్రమాదం నాటకాన్ని ఆమె ఆడడం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి ముందు బుద్ధిమంతుడుగా ఉన్న సేతుపతి, పెళ్లైన రోజు నుంచి ప్రతిరోజూ మద్యం తాగి రావడం, రాత్రుల్లో నరకం చూపిస్తుండడం, అనుమాన పడడం, నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా తిడుతుండడంతో అడ్డుతొలగించుకునేందుకు నిర్ణయించినట్టు పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. గురువారం సాయంత్రం పూటుగా మద్యం తాగి మత్తులో ఉన్న సేతుపతిని ఇంటితో పాటు తగులబెట్టి అగ్నిప్రమాదం జరిగినట్టుగా నాటకం ఆడానని వివరించారు. అయితే, బయట తాళం వేసి ఇరుక్కుపోయానని ఆమె పేర్కొంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓలా క్యాబ్‌ అంటూ ప్రైవేటుకారులో...

తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా..

యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారని: వైరల్‌

ఘరానా దొంగలు.. ఏసీలు రిపేరు చేస్తామంటూ..

జూదంలో భార్యను పణంగా పెట్టి..

80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

జిల్లాలో సారా పరవళ్లు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం

వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి

రూ.లక్ష కోసం ట్రిపుల్‌ తలాక్‌.. కేసు నమోదు..!

అప్పు తీర్చలేకే హత్య 

అత్తపై అల్లుడి లైంగిక దాడి

ప్రాణం తీసిన సరదా పందెం 

ఉద్యోగం కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..

భార్యను కడతేర్చిన భర్త

అమ్మా ! నాకెందుకు ఈ శిక్ష.. 

వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

భరించలేక.. బాదేశారు!

కాళ్లపారాణి ఆరకముందే నూరేళ్లు

చదువుతూనే గంజాయి దందా..

నిఘా నిద్ర.. జూదం దర్జా! 

ఉపాధ్యాయ వృత్తికే కళంకం

మనోహరన్‌కు రెండు ఉరి, యావజ్జీవ శిక్షలు

రూ. 25 కోట్ల అధర్మ ఆదాయం!

హలో ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నా..

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

కుమార్తెను కడతేర్చి తల్లి ఆత్మహత్య

తూత్తుకుడిలో అదీబ్‌

కాజల్‌తో భేటీకి రూ.60 లక్షలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది

కొత్త గెటప్‌

దేవదాస్‌ కనకాల ఇక లేరు