దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య

16 Oct, 2019 08:04 IST|Sakshi
కుమారుడు లోకేష్‌తో సురేష్, అనసూయ

తమిళనాడు ,టీ.నగర్‌: దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్తను హతమార్చిన భార్యతో సహా ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై సమీపంలోని పుళల్‌ బుద్దగరం వెంకటేశ నగర్‌ 13వ వీధికి చెందిన సురేష్‌ (24) అదే ప్రాంతంలోని మాంసం దుకాణంలో పని చేస్తున్నాడు. ఇతనికి విల్లుపురానికి చెందిన అనసూయతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి లోకేష్‌ అనే కుమారుడు ఉన్నారు. ఇలా ఉండగా సోమవారం ఉదయం పుళల్‌ పోలీసు స్టేషన్‌కు సురేష్‌ మృతి చెందినట్టు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ తంగదురై ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలం చేరుకున్నారు.

సురేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు విచారణలో అనసూయను విచారించగా అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఆమె భర్త సురేష్‌ తరచుగా మద్యం సేవించి తగాదాకు దిగేవాడని తెలిపింది. దీంతో తన బంధువు మారన్‌ (22)ను పిలిపించి, అతని సాయంతో భర్త సురేష్‌ గొంతును దుప్పట్టాతో నులిపి హతమార్చినట్లు తెలిపింది. ముందుగా సురేష్‌కు దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో అతను స్పృహ తప్పినట్లు తెలిపింది. ఆ తర్వాత మారన్‌ సాయంతో ఉరిపై వేలాడదీసినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో అనసూయను  పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి మారన్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

వీఎమ్‌సీ సర్కిల్ కార్యాలయాలపై ఏసీబీ దాడి

కన్న బిడ్డలను కాల్చి చంపిన తల్లి!

పగటిపూట దొంగతనాలు.. బుడత బ్యాచ్‌కు చెక్‌!

బాలుడి ప్రాణం తీసిన నాటువైద్యం

లిప్‌లాక్‌ చేసి.. నాలుక కట్‌ చేశాడు

సరూర్‌నగర్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు

మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరో షాక్‌

కబీర్‌సింగ్‌ ఎఫెక్ట్‌.. యువతిని చంపిన టిక్‌టాక్‌ స్టార్‌

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహ​​​​​​​త్యాయత్నం

అందుకే ఆ ముగ్గురినీ చంపేశాడు!

యువతి అనుమానాస్పద మృతి

హిందూపురం రైలు పట్టాలపై మృతదేహాలు..

అక్రమ నిర్మాణాలపై బల్దియా కొరడా

ఎయిర్‌టెల్‌ సంస్థ సీఈఓనని ‘ఫ్యాన్సీ’ వల

జియో లాటరీ పేరుతో లూటీ!

రైలు కిందపడి యువతి మృతి

అక్కడ చోరీ ...ఇక్కడ విక్రయం!

భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

బ్యాంక్‌లోని 17 కిలోల బంగారం మాయం!

ఖాకీల ముందే బావను కడతేర్చాడు..

ఐఏఎఫ్‌ అధికారులకు కోర్ట్‌ మార్షల్‌

అల్లుడిపై కత్తితో దాడి చేసిన మామ

ప్రియుడిపై ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఫిర్యాదు

పిల్లల ఆకలి చూడలేక తల్లి ఆత్మహత్య

ఉరి వేసుకుని దంపతులు ఆత్మహత్య

బాలుడిని బలి తీసుకున్న మ్యాగీ వంట..

తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని..

ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ..

ఆర్టీసీ బస్‌-టాటా ఏస్‌ ఢీ, ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేటి నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు

జాన్వీ డౌట్‌

డెబ్భై నిండిన డ్రీమ్‌ గర్ల్‌

ఖైదీ యాక్షన్‌

అతిథి వస్తున్నారు

మళ్లీ జంటగా..