కష్టాలు భరించలేక భర్తను కడతేర్చిన భార్య

15 Jun, 2019 10:25 IST|Sakshi
హత్యా స్థలాన్ని పరిశీలిస్తున్న ఏఎస్సీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ 

 మద్యం తాగి వేధించడమే కారణం

 ఈ సంఘనటతో అనాథలైన పిల్లలు

గంగవరం (తూర్పు గోదావరి) : మద్యం తాగి భార్యాబిడ్డలను వేధిస్తున్న భర్త హత్యకు గురైన సంఘటన గంగవరంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన గురువారం సాయంత్రం జరగగా శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. సంఘటన వివరాలను రంపచోడవరం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ స్థానిక విలేకర్లకు శుక్రవారం సాయంత్రం వివరించారు. పాత గంగవరం గ్రామానికి చెందిన కంగల కృష్ణమూర్తి దొర (40)అనే వ్యక్తి రోజూ మద్యం సేవించి భార్యబిడ్డలను హింసిస్తున్నాడన్నారు. గురువారం సాయంత్రం ఐదుగంటల సమయంలో బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన కృష్ణమూర్తిదొర భార్య పిల్లలతో ఘర్షణకు దిగాడన్నారు. మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తిదొర భార్య వరలక్ష్మి మధ్య తీవ్ర ఘర్షణకు దిగడంతో తోపులాట జరిగిందన్నారు. ఈ సమయంలో కృష్ణమూర్తిదొర మెడలో ఉన్న తువాళ్లను భార్య గట్టిగా తిప్పేయడంతో ఊపిరాడక కృష్ణమూర్తి మృతి చెందినట్టు ఏఎస్పీ వివరించారు. ప్రాథమిక సమాచారం మేరకు హత్య కేసుగా నమోదు చేశామని ఏఎస్పీ వివరించారు.

హత్యా స్థలాన్ని ఏఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్, సీఐ గౌరీశంకర్‌ పరిశీలించి విచారణ చేశారు. అడ్డతీగల సీఐ గౌరీశంకర్‌ మాట్లాడుతూ గంగవరం వీఆర్వో ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేశామన్నారు. ఈ  కేసును రంపచోడవరం  ఏఎస్పీ ఆధ్వర్యంలో  దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సీఐ వివరించారు. ఈ సంఘటనతో కృష్ణమూర్తి దొర ఇద్దరు బిడ్డలు అనాథలుగా మిగిలారు. కంగల అరవింద్‌ టెన్త్‌ పాస్‌ కాగా, కుమార్తె కంగల అనూష 8వ తరగతి అభ్యసిస్తోంది. వీరిద్దరూ రంపచోడవరం గురుకుల పాఠశాలల్లోనే చదువుతున్నారు. ఈ ఘటనపై బంధువులు, గ్రామస్తులు ఎవ్వరూ నోరువిప్పడం లేదు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణం: 24 మంది సజీవ దహనం

డ్రైవర్‌ నిద్రమత్తు.. 9 మంది దుర్మరణం..!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

మద్యం మత్తులో తాళం పగులగొట్టి ఆత్మహత్య

పని చేస్తున్న సంస్థకే కన్నం

మృత్యువులోనూ వీడని బంధం

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

పని చేస్తున్నసంస్థకే కన్నం

నీళ్లనుకుని లైజాల్‌ తాగి...

సర్వే అంటూ ఇంటి తలుపుతట్టి..

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

అల్లుడిని చంపిన మామ

వజ్రాల వాటాలో గొడవ.. అందుకే చంపేశాం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

డ్రైయినేజీలో ఆలయ హుండీలు!

వైద్యం అందక చిన్నారి మృతి

బాబాయిపై అబ్బాయి బండరాయితో దాడి!

సినీ నటి డాటా చోరీ

ఒకరి వెంట ఒకరు..

ఆ బస్సు ఎక్కితే అంతే సంగతులు..!

అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..

ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!

ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి

కిలాడీ ‘యాప్‌’తో జర జాగ్రత్త!

కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..

చికెన్‌ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య

హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ

టైర్‌ పేలి లారీని ఢీకొన్న ఇన్నోవాకారు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడోసారి తండ్రి అయిన హీరో!

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ