కాపురానికి తీసుకెళ్లాలని ఆందోళన

11 Sep, 2019 08:14 IST|Sakshi
భారతికి మద్దతు తెలిపిన గ్రామస్తులు

ఫేక్‌బుక్ ప్రేమ

అత్తగారి ఇంటి ఎదుట బైఠాయింపు

పరారీలో భర్త, అత్తమామలు

సాక్షి, హుస్నాబాద్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాపురం సజావుగా సాగుతోంది. ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. అనంతరం కట్నం తీసుకురావాలని భర్త ఇంటి వారు వేధించడం మొదలు పెట్టారు. కట్నం తెస్తేనే కాపురానికి రావాలని ఇంటికి పంపించారు. దీంతో దిక్కుతోచని ఆ అభాగ్యురాలు కాపురానికి తీసుకెళ్లాలని అత్తగారి ఇంటి ఎదుట బైఠాయించింది. అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామంలో భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని అత్తగారి ఇంటి ఎందుట భార్య తన ఇద్దరు ఆడ పిల్లలతో బైఠాయించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.

 ఇంటి బయట ఇద్దరు పిల్లలతో భారతి

స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇవి.. మంచిర్యాల జిల్లా, కౌటపల్లి మండలం, రోయ్యలపల్లి గ్రామానికి చెందిన భారతి అనే యువతికి మండలంలోని గౌరవెల్లి గ్రామానికి చెందిన మజ్జిగ రంజిత్‌తో 2015లో జనగామ జిల్లా హనుమాన్‌ గుడిలో పెళ్లి జరిగింది. నాలుగేళ్ల క్రితం ఫేక్‌బుక్, వాట్సాప్‌లో పరిచయం ఏర్పండి అది కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఎదురించి పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్నాళ్లపాటు కాపురం సజావుగా సాగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తరువాత రూ.20లక్షలు కట్నం తీసుకొనిరావాలని ఇబ్బందులకు గురి చేస్తూ హింసింస్తున్నారని భారతి వాపోయింది. కాపురానికి తీసుకెళ్లడం లేదని, తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని తన భర్త ఇంటి మందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న అత్తామామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తన భర్తను తనకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకుంటోంది భారతి. గ్రామంలోని మహిళలు కూడా భారతికి మద్దతుగా నిలిచారు.

మరిన్ని వార్తలు