బురారీ కేసులో కీలక మలుపు

6 Jul, 2018 20:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సంచలనం రేపిన కుటుంబం ఆత్మహత్యల కేసు కీలక మలుపు తిరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని ఆత్మహత్యలకు ప్రేరేపించినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. తాంత్రిక పూజల వెనుక ఆ మహిళ హస్తం ఉందన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. 

పోలీసుల కథనం ప్రకారం.. తండ్రి తమను కాపాడతాడని భాటియా కుటుంబం నమ్మేది. ఓ కప్పులో నీళ్లు ఉంచితే.. అది రంగు మారగానే నాన్న వచ్చి కాపాడతాడని బురారీ ఏరియాకి చెందిన లలిత్‌ భాటియా(45) తన కుటుంబాన్ని నమ్మించాడు. ఈ క్రమంలో తాంత్రిక పూజలు చేసిన అనంతరం కుటుంబం మొత్తం గత ఆదివారం సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అయితే ‘గీతా మా’ అనే మహిళ వీళ్లను తాంత్రిక పూజల దిశగా నడిపించినట్లు అనుమానాలున్నాయి.

మరోవైపు కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రధాన ద్వారం తెరిచి ఉండటంతో పూజలు చేసిన వ్యక్తి ఆ మార్గం గుండానే వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి 12వ వ్యక్తి మిస్టరీ చేధించే క్రమంలో గీతా మాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించి ఓ డైరీని సేకరించిన పోలీసులు, దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఎవరీ గీతా మా...?
లలిత్‌ భాటియా కుటుంబానికి, పోలీసులు అదుపులోకి తీసుకున్న గీతా మాకు సంబంధం ఉంది. భాటియా కుటుంబం ఉంటున్న ఇంటిని ఓ కాంట్రాక్టర్‌ నిర్మించారు. ఆ కాంట్రాక్టర్‌ కూతురే గీతా మా కావడం గమనార్హం. ఆమెకు లలిత్‌ భాటియాకు సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. ఏదైన కారణంతో భాటియా కుటుంబం తమకు తామే బలవన్మరణానికి పాల్పడేలా చేసి ఉండొచ్చునేమోనని గీతా మాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత కథనాలు

11 మంది మరణం: అతడే సూత్రధారి

బురారీ కేసులో 12వ వ్యక్తి??

తండ్రి కాపాడుతాడని...

మరిన్ని వార్తలు