నాయకుడిపై చెప్పులతో దాడి చేసిన మహిళ!

5 Oct, 2019 12:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మధ్యప్రదేశ్‌ : గ్వాలియర్‌లోని ప్రభుత్వ అధికారి, స్థానిక నాయకుడిపై ఓ మహిళ చెప్పులతో దాడికి దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఆ మహిళపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. లీలా జాతవ్‌(35) మహిళకు ప్రభుత్వ లాటరీ ద్వారా ఇల్లు లభించింది. అయితే తనకు కేటాయించిన ఇంటిపై ఆసంతృప్తితో ప్రతిపక్ష నాయకుడైన కృష్ణారావు దీక్షిత్‌, అక్కడి రాజీవ్‌ గాంధీ హౌసింగ్‌ స్కీమ్‌ నోడల్‌ అధికారి అయిన పవన్‌ సింఘాల్‌పై  మహిళ గురువారం దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ తనను ఇంకా అరెస్టు చేయలేదన్నారు.

కాగా ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం అక్కడి ప్రభుత్వం రాజీవ్‌ గాంధీ హౌజింగ్‌ స్కీం ద్వారా 832 ఇళ్లను నిర్మించింది. వాటిని లాటరీ డ్రా పధ్దతి ద్వారా అర్హులైన వారికి ఇంటిని కేటాయించే ఉద్దేశంతో గురువారం లాటరీ డ్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సదరు మహిళ.. ఇదంతా మోసం అని, ఈ లాటరీ పద్దతిలో కుట్ర దాగుందని.. తమకు ఇష్టమైన వాళ్లకే మంచి ఇల్లు కేటాయిస్తున్నారు అంటూ గట్టిగా అరుస్తూ... పవన్‌ సింఘాల్‌పై చెప్పులతో దాడి చేసింది. ఈ క్రమంలో తనని ఆపడానికి యత్నించిన కృష్ణారావుపై కూడా ఆమె దాడికి దిగింది. ఈ విషయం గురించి  కృష్ణారావు మాట్లాడుతూ.. తను కోరుకున్న ఫ్లాటు లాటరీలో రాలేదన్న కోపంతోనే ఆమె ఇలా చేసిందని పేర్కొన్నాడు. కాగా వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు రాజీవ్‌ గాంధీ హౌజింగ్‌  పథకం కింద ఒక్కొక్కొ ప్లాట్‌ను రూ. 3.5 లక్షల లాటరి పద్దతిలో కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు