ఆత్మహత్యాయత్నంతో మతిస్థిమితం కోల్పోయిన మహిళ

23 Apr, 2018 11:22 IST|Sakshi
జీజీహెచ్‌లో మంచానికి కాళ్లు, చేతులు కట్టివేసి వైద్యం చేస్తున్న దృశ్యం

ధర్మపోరాట దీక్ష సమయంలో పురుగుమందు తాగిన మహిళ

కాళ్లు, చేతులు   మంచానికి కట్టి వైద్యసేవలు

తల్లి పరిస్థితి చూసి తల్లడిల్లుతున్న కుమార్తెలు

సర్పవరం (కాకినాడ సిటీ) : టీడీపీ మహిళా నాయకురాలు తనను వేధిస్తోందంటూ కాకినాడ ధర్మపోరాట దీక్షలో హోంమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సమక్షంలో పురుగుమందు తాగి కాకినాడ ప్రభుత్వాసుపత్రి మెడికల్‌ విభాగం ఏఎంసీయూ–2లో చికిత్స పొందుతున్న మల్లాడి లక్ష్మి పరిస్థితి మూడురోజులైనా విషమంగానే ఉంది.

ఆమెకు ముగ్గురు కుమార్తెలు సంధ్యకుమారి, అమృతవల్లీలకు వివాహం కాగా, మౌనికకు వివాహం కాలేదు. ఇదిలా ఉంటే తమ తండ్రి చేపలు వేటకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తాడని, తల్లి లక్ష్మి జీజీహెచ్‌లో సెక్యూరిటీగా పనిచేస్తుందని కుమార్తెలు తెలిపారు.

వేట నిషేధం ఉండడంతో ప్రస్తుతం అమ్మ ఆదాయంపైనే ఆధారపడ్డామని, అమె ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉండడంతో తమ కుటుంబం మొత్తం రోడ్డున పడిందని కుమార్తెలు కన్నీటి పర్యంతమవుతున్నారు. వైద్యులు ఏడు రోజుల వరకు ఆమె పరిస్థితిని చెప్పలేమంటున్నారని, ప్రస్తుతం విషమంగానే ఉందని చెప్పారని వారు రోధిస్తున్నారు.  

మరిన్ని వార్తలు