'ఆ వీడియో చూసి చనిపోవాలనుకుంది'

25 Feb, 2018 15:39 IST|Sakshi

సాక్షి, జబల్‌పూర్‌ : తన తండ్రిని అవమానించిన తీరును చూసి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అదృష్టం కొద్ది ప్రాణాపాయం నుంచి బయటపడి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. వివరాల్లోకి వెళితే, డబ్బు వివాదమై జబల్‌పూర్‌లోని బీజేపీ మైనారిటీ సెల్‌ విభాగం అధ్యక్షుడు మహ్మద్‌ షఫిక్‌ అలియాస్‌ హీరా అనే వ్యక్తి బాధితురాలి తండ్రిని మొకాళ్లపై కూర్చొబెట్టి నడుం వంచి దండం పెట్టించుకున్నాడు. పైగా అతడి వీపుపై ఓ వాటర్‌ బాటిల్‌పై పెట్టి వీడియోలు తీయించి ఆ వీడియోలను వాట్సాప్‌లో పెట్టించాడు.

అది కాస్త వైరల్‌గా మారి బాధితురాలు చదువుకునే కాలేజీలో స్నేహితుల ఫోన్‌లలోకి వెళ్లింది. ఆ వీడియోను తాను కూడా చూడటంతో తీవ్రంగా అవమానంగా భావించి ఇంటికొచ్చిన ఆ యువతి వెంటనే పురుగుల మందులాంటి విషాన్ని తీసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇలా చేసిన సదరు బీజేపీ నేతపైనా, ఆ వీడియోను షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో పెట్టిన వ్యక్తులపైనా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు