హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

14 Jul, 2019 09:13 IST|Sakshi
గుంజా లక్ష్మమ్మ

మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి.. వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి.. క్షణికావేశం బంధాలకు దూరం చేస్తున్నాయి.. ఆవేశంలో చిన్నారుల ముందే దారుణాలకు పాల్పడుతున్నారు.. భర్త వివాహేతర సంబంధాని ప్రశ్నించడంతో వేధింపులకు గురిచేశారు.. చివరికి పక్కా ప్రణాళికతో దారుణానికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనే దొనబండలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
సాక్షి, ఇబ్రహీంపట్నం(కృష్ణా) : మహిళను బంధువులే దారుణంగా హత్య చేసిన ఘటన మండలంలోని దొనబండ బీసీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన గుంజా లక్ష్మమ్మ(28)ను అదే గ్రామానికి చెందిన ఏడుకొండలు పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. లారీ డ్రైవర్‌గా పనిచేసే ఏడుకొండలు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడాది క్రితం ఆ మహిళతో హైదరాబాద్‌కు వెళ్లి వేరే కాపురం పెట్టాడు.

దీంతో న్యాయం చేయాలని లక్ష్మమ్మ పోలీసులను ఆశ్రయించింది. స్థానికులతో కలసి 65 నంబర్‌ జాతీయ రహదారిపై ధర్నాకు దిగింది. హైవేపై ధర్నా చేసినందుకు కొంతమంది గ్రామస్తులతో పాటు లక్ష్మమ్మపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు భర్త ఫోన్‌ నంబర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి అతడిని రప్పించారు. కోర్టులో కేసు నడుస్తోంది.

ఏడాదిగా భర్తతో పాటు అత్తామామలు ఆమెతో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. బుధవారం కోర్టు వాయిదా ఉండడంతో వివాదం చోటుచేసుకుంది. ఎలాగైనా వదిలించుకోవాలకుని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మమ్మను అత్తామామలు గుంజా దుర్గ, ఆర్ముగం, బావ మునియప్ప కలసి దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. 

తల్లిని చంపారంటూ..
తల్లి లక్ష్మమ్మను బంధువులు ఏ విధంగా చేసింది చిన్నకుమార్తె(6)  స్థానికులకు, బంధువులకు చెబుతోంది. హత్యచేసిన అనంతరం ముగ్గురు గ్రామం విడిచి పారిపోయారు. లారీ డ్రైవర్‌గా డ్యూటీలో ఉన్న భర్త ఏడుకొండలు ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి జరిగిన విషయాన్ని బంధువుల నుంచి సేకరించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!