లైంగిక వేధింపులతో వివాహిత ఆత్మహత్య

8 Aug, 2019 10:58 IST|Sakshi

సాక్షి, గుంటూరు(మాడుగుల) : లైంగిక వేధింపులు తాళలేక వివాహిత మహిళ గనిపల్లి మరియకుమారి (24) మంగళవారం అర్ధ రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాడుగుల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మాడుగుల గ్రామానికి చెందిన గనిపల్లి అన్నారావు తన అక్క కూతురైన మరియకుమారిని 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. బడ్డీకొట్టు నడుపుతూ, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గనిపల్లి దిలీప్‌లెవి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా దిలీప్‌లెవి తన సెల్‌ ఫోన్‌ను పిల్లలతో మరియకుమారి వద్దకు పంపించి ఆమెతో మాట్లాడాలంటూ లైంగికంగా  వేధిస్తున్నాడు. ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లినా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దిలీప్‌లెవి గతంలో రెండు మొబైల్స్‌ను పంపించగా మరియకుమారి భర్త అన్నారావు తీసుకొని గొడవపడ్డారు.

మంగళవారం సాయంత్రం మరో మొబైల్‌ఫోన్‌ పిల్లలతో పంపించగా గమనించిన భర్త తీసుకొని ఆమె తల్లి, తమ్ముడికి విషయం తెలిపాడు. తమ్ముడు దారివేముల సునీల్‌ అక్కను మందలించగా తనకు ఏ పాపం తెలియదని, దిలీప్‌లెవి తనను చాలా కాలంగా వేధిస్తున్నాడని బోరున విలపించింది. అనంతరం మనస్తాపానికి గురైన మరియకుమారి అర్ధరాత్రి సమయంలో భర్త నిద్రపోతుండగా ఇంట్లో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున నిద్రలేచిన భర్తకు భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలికి తొమ్మిదేళ్ల మానసిక దివ్యాంగుడైన కుమారుడు అశోక్, పదేళ్ల ప్రమీళ, మూడేళ్ల లతిక, 14 నెలల రుషి ఉన్నారు. అమ్మా...లే అంటూ పిల్లలు దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంచినీళ్లు తెచ్చేలోపే.. 

స్నేహితుడి భార్య కోసం హత్య..!

అమెరికాలో ‘చచ్చేవరకు ఉండే జబ్బు’

గుజరాత్‌ కోర్టుకు ఐఎస్‌ఐ తీవ్రవాది

మాకేదీ న్యాయం? :హాజీపూర్‌ వాసులు

ఆధిపత్య పోరులోనే కోటయ్య హత్య

వజ్రాలు కొన్నాడు... డబ్బు ఎగ్గొట్టాడు

దొంగ పనిమనుషులతో జరజాగ్రత్త..

పసి మొగ్గలను నలిపేస్తున్న కీచకులకు ఉరే సరి!

తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి..

బాత్‌రూంలో ఉరివేసుకొని నవవధువు మృతి

స్టార్‌ హోటల్‌లో దిగాడు.. లక్షల్లో బిల్లు ఎగ్గొట్టాడు

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

ప్రాణం బలిగొన్న జాలీ రైడ్‌

టాయిలెట్‌ సీటును నోటితో శుభ్రం చేయాలంటూ..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

భర్తను పోలీసులకు అప్పగించిన మహిళ

మహిళలే..చోరీల్లో ఘనులే!

అబ్రకదబ్ర..కుక్కర్‌లో బంగారం వేడి చేస్తే..!

అమెరికాలో కత్తిపోట్లు..

ఉన్మాదికి ఉరిశిక్ష

సెయిల్‌ ఛైర్మన్‌పై హత్యాయత్నం?

వరంగల్‌ శ్రీహిత హత్యకేసులో సంచలన తీర్పు 

కాపాడబోయి.. కాళ్లు విరగ్గొట్టుకున్నాడు..!

విశాఖ చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్

‘పాయింట్‌’ దోపిడీ..!

ఇళ్ల మధ్యలో గుట్టుగా..

ఆదిత్య హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు..

‘గాంధీ’ సూపరింటెండెంట్‌ సంతకం ఫోర్జరీ

గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ పేరిట మోసం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...