స్మార్ట్ ఫోన్ కొనివ్వ‌లేద‌ని భార్య దారుణం!

29 May, 2020 16:42 IST|Sakshi

న్యూఢిల్లీ : భ‌ర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వ‌లేద‌ని ఓ వివాహిత ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డి ప్రాణాలు కోల్పోయిన‌ ఘ‌ట‌న ఢిల్లీలో బుధవారం చోటుచేసుకుంది. వివ‌రాలు.. మైదన్‌ఘిరి ప్రాంతానికి చెందిన దీప‌క్ మిశ్రాకు జ్యోతితో (29 ) ఏడేళ్ల క్రితం వివాహ‌మైంది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే గ‌త కొన్ని రోజులుగా స్మార్ట్ ఫోన్ కొనివ్వాల‌ని ఒత్తిడి చేస్తున్నా భ‌ర్త ప‌ట్టించుకోక‌పోడంతో ఆమె తీవ్ర అస‌హ‌నానికి గురై ఈనెల 27న కిరోసిన్  పోసుకొని నిప్పంటించుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టినట్టు పేర్కొన్నారు. (గంభీర్‌ ఇంట్లో కారు చోరీ.. )

కాగా, లాక్‌డౌన్‌ కారణంగా అన్ని విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిల్లల ఆన్‌లైన్‌ పాఠాలకు ఉపకరింస్తుందని, స్మార్ట్ ఫోన్ కొనివ్వాలంటూ జ్యోతి భ‌ర్త‌పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది. ఈ దంప‌తుల‌కు నాలుగు, ఆరేళ్ల వయసున్న ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. అయితే, ఆర్థికంగా వీలుపడక పోవడంతో భార్యకు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేక పోయానని దీపక్‌ మిశ్రా చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్‌ ముగిశాక కొందామ‌ని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అయినప్ప‌టికీ జ్యోతి వినిపించుకోలేదు. భ‌ర్త తన మాట కాదన్నాడనే మనసస్తాపంతో ఒంటికి నిప్పంటించుకుంది. 90 శాతం గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు. (బయటికొచ్చినా దొంగ పనులు మానలేదు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు