ప్రేమికుడు కాదన్నాడని..

29 Aug, 2018 10:56 IST|Sakshi

సింగరాయకొండ (ప్రకాశం): ప్రేమించిన వాడు వివాహం చేసుకోవటానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలోని పాకల పంచాయతీ ఆదిఆంధ్ర కాలనీలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం గ్రామానికి చెందిన దావులూరి భానుప్రకాష్, ఓ యువతి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ సమయంలో భానుప్రకాష్‌కు ఉపాధ్యాయునిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.

దీంతో వీరిద్దరూ తమ పెద్దలకు తెలియకుండా విజయవాడలోని గుణదల మేరిమాత ఆలయంలో ఉంగరాలు మార్చుకున్నారు. తరువాత వీరి విషయం తెలిసిన పెద్దలు వివాహానికి ఒప్పుకున్నారు. అనంతరం సుప్రజ తల్లిదండ్రులు పెండ్లి ప్రయత్నంలో ఉండగా.. ఈనెల 21వ తేదీ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి వివాహం చేసుకొనేది లేదని తేల్చి చెప్పారు. గ్రామ పెద్దలతో సమస్య పరిష్కారానికి కృషి చేసినా ప్రయోజనం లేకపోవటంతో ఈనెల 24వ తేదీ బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కూడా సమస్య పరిష్కారానికి కృషి చేసినా ప్రయోజనం లేకపోవటంతో మనస్థాపానికి గురైన ఆమె మంగళవారం బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి. నాగమల్లేశ్వరరావు తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుప్పంలో కీచకపర్వం..!

వాకింగ్‌కు వెళ్లిన బీజేపీ నేత హత్య..!!

ప్రియుడితో కలసి మామను...

విధుల్లో కానిస్టేబుల్‌.. క్షణాల్లో దూసుకొచ్చిన బస్సు

కాఫీ తాగి తల్లీకూతురు మృతి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీటూ ఆరోపణలపై నమ్మకం లేదు : హీరోయిన్‌

సల్మాన్‌ సినిమాలో సౌత్‌ హీరో..!

గోల్డెన్‌ రీల్‌ అవార్డుకు ‘2.ఓ’

మణికర్ణికకు మరో ఎదురుదెబ్బ

మాస్‌ మార్కే కాపాడిందా..?

జీవీతో ఐశ్వర్య