పెళ్లికి బావ కాదన్నాడని.. 

5 Jul, 2020 11:18 IST|Sakshi

 మనస్తాపంతో యువతి ఆత్మహత్య 

కడకెల్లలో విషాద ఛాయలు  

వీరఘట్టం(శ్రీకాకుళం జిల్లా): బావ పెళ్లి చేసుకోనన్నాడని మనస్తాపం చెందిన ఓ యువతి తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం మండలంలోని కడకెల్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కడకెల్లలో ఇటుకలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న కన్నూరి ఈశ్వరమ్మకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రామలక్ష్మి ఇంటర్‌ వరకు చదివింది. చిన్నతనం నుంచి గ్రామంలో తన మేనత్త కొడకంటే రామలక్ష్మికి ఎంతో ఇష్టం. ఆ ఇష్టం ప్రేమగా మారింది. దీంతో ఆమె తల్లి ఈశ్వరమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి విషయమై మాట్లాడటానికి శనివారం ఉరిటి రవి ఇంటికి వెళ్లారు. ఆమెను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని రవి చెప్పాడు. విషయం తెలుసుకున్న రామలక్ష్మి తనువు చాలించింది. కళ్ల ముందు తిరిగాడే కుమార్తె క్షణాల్లో అనంత లోకాలకు చేరుకోవడంతో ఆ తల్లి బోరున విలపించింది. 

గుట్టుగా.... 
కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు చేసేందుకు శ్మశానవాటికకు వెళ్లారు. ఇంతలో విషయం తెలియడంతో తహసీల్దార్‌ ఎం గణపతి, ఎస్‌ఐ జీ భాస్కరరావు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం చేసేందుకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా