ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య

25 May, 2018 11:55 IST|Sakshi
మృతి చెందిన వెంకటేశ్వరి

మహానంది: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని స్థానిక ఈశ్వర్‌ నగర్‌లో గజ్జల వెంకటేశ్వరి (19)అనే యువతి గురువారం ఆత్మహత్య చేసుకుందని ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు తెలిపారు. వివరాలు.. వెంకటేశ్వరికి తల్లిదండ్రులు ఏడాది క్రితం సమీప బంధువుతో పెళ్లి నిశ్చయించారు. అయితే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని కుటుంబ సభ్యులతో చెబుతుండేది.

వాళ్లు సర్ధిచెబుతూ వచ్చారు. తన మాట వినడంలేదని తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేశ్వరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలసుకున్న ఎస్‌ఐ సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేస్తున్నామని ఎస్‌ఐ  తెలిపారు.  

మరిన్ని వార్తలు