మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

21 Sep, 2019 12:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: లైంగిక వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ఒక మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విశాఖ నగరంలో చోటు చేసుకుంది. అదనపు కమాండర్‌ టీవీరావు, సబ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ ఆనందరావులు తరుచూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని మల్కాపురం సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ టెర్మినల్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. మల్కాపురం హెచ్‌పీసీఎల్‌లో లావణ్యతో పాటు ఆమె భర్త కూడా సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

గత కొంతకాలంగా అధికారులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లావణ్య పేర్కొంది. దిక్కుతోచక తనువు చాలించాలని నిర్ణయించుకున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లావణ్యను చికిత్స నిమిత్తం నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల ద్వారా మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఉదయ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు