పోకిరీని రఫ్పాడించిన చంచల్‌

11 Dec, 2019 08:30 IST|Sakshi

ఆకతాయిని ఉతికి ఆరేసిన మహిళా కానిస్టేబుల్‌

కాన్పూర్‌:  ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం  మైనర్‌ బాలికలు, మహిళలపై అత్యాచారాలు, దాడులతో అట్టుడికిపోతోంది. అయితే  ఒక​ మహిళా కానిస్టేబుల్‌ మాత్రం బాలికలను వేధిస్తున్న ప్రబుద్ధిడికి తగిన శాస్తి చేసిన వైనం ఆకట్టుకుంటోంది.  కాన్పూర్‌,  బీతూర్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక  బాలికలు  పాఠశాలకు వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి  అనుచితంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన  మహిళా కానిస్టేబుల్‌  ఆ పోకిరీని పట్టుకుని  రఫ్పాడించింది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో  వైరల్‌ అవుతోంది. 

ఆమే బీతూర్ పోలీస్ స్టేషన్‌లోని యాంటీ రోమియో స్క్వాడ్‌ మహిళా కానిస్టేబుల్‌ చంచల్ చౌరాసియా. రోమియోల భరతం పట్టే పనిలో ఉన్న చంచల్‌  అతగాడి కాలర్‌ పట్టుకుని మరోసారి ఇలాంటి వేధింపులకు గురి చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు. అంతేకాదు బూటు తీసి ఒకటి కాదు రెండు కాదు 22 సార్లు వాయించి పడేసారు.  అనంతరం నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు