తల్లీ, కూతురికి గుండు కొట్టించి..

16 Feb, 2018 17:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాంచీ : మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఓ తల్లీ కూతురికి గ్రామస్తులు గుండు కొట్టారు. ఈ సంఘటన జార్ఖండ్‌ రాష్ర్టంలోని రాంచీ శివార్లలో గురువారం జరిగింది. ఆలస్యంగా బాధితులు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ఓ మహిళ వీళ్లు చేసే మంత్రాల కారణంగా చనిపోయిందని భావించి గ్రామస్తులు వీరి మీద దాడికి దిగారు. గ్రామ సమీపంలో ఉన్న నది వద్దకు తీసుకుపోయి తల్లి(65), ఆమె కూతురి(35)కీ గుండు కొట్టారు.

అనంతరం బలవంతంగా ఇద్దరికీ తెల్లచీరలు కట్టించారు. అంతా అయిన తర్వాత సెప్టిక్‌ ట్యాంక్‌లోని నీటిని వాళ్లచేత తాగించారు. జరిగిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గతంలోని చనిపోయిన మహిళ అనారోగ్యంతోనే చనిపోయిందని తెలుస్తోంది. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో 15 ఏళ్లుగా 700 మంది మంత్రగాళ్లను జార్ఖండ్‌లో చంపినట్లుగా నివేదికలు తెలుపుతున్నాయి. 

మరిన్ని వార్తలు