సిమ్‌ అప్‌గ్రేడ్‌ పేరిట మహిళకు టోకరా

1 Jun, 2020 12:45 IST|Sakshi

లక్నో : సిమ్‌ అప్‌గ్రేడ్‌ పేరిట ఓ సైబర్‌ నేరగాడు మహిళనుంచి లక్షల రూపాయలు దోచుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 7వ తేదీన నోయిడా సెక్టార్‌ 108కు చెందిన వర్ష అగర్వాల్‌కు మొబైల్‌ నెట్‌వర్క్‌ కంపెనీ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ నుంచి ఓ ఫోన్‌ వచ్చింది. ఆమె ఫోన్‌లో మాట్లాడుతున్న సందర్భంలో ‘‘ మీ 3జీ సిమ్‌ కార్డు త్వరలో పనిచేయదు. మీరు వెంటనే దాన్ని 3జీ నుంచి 4జీకి మార్చుకోండి’’ అని అన్నాడు కస్టమర్‌ కేర్‌ వ్యక్తి‌. వర్ష ఏమీ ఆలోచించకుండా సిమ్‌ కార్డు అప్‌గ్రేడ్‌కు అంగీకరించింది. అతడు చెప్పినట్లు చేసింది. అప్‌గ్రేడ్‌ ప్రాసెస్‌ మొదలైన వెంటనే ఓ 72 గంటల పాటు సిమ్‌ పనిచేయటం మానేస్తుందని కస్టమర్‌ కేర్‌ వ్యక్తి ఆమెకు చెప్పి, ఫోన్‌ కట్‌ చేశాడు. ( 35 పోట్లు, తలను శరీరం నుంచి వేరుచేసి.. )

అయితే వారం రోజులు గుడుస్తున్నా అలాంటిదేమీ జరక్కపోవటంతో ఆమెకు అనుమానం కలిగింది. ఆ వెంటనే బ్యాంకు దగ్గరకు వెళ్లగా తన అకౌంట్‌లోంచి దాదాపు 9.52లక్షలు వేరే అకౌంట్‌కు బదిలీ అయినట్లు, ఆ వెంటనే డబ్బులు విత్‌ డ్రా అయినట్లు తెలుసుకుంది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సిమ్‌ స్వాపింగ్‌ ద్వారా అతడు వర్ష అకౌంట్‌లోని డబ్బుల్ని దొంగిలించాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు