అదనపు కట్నం కోసం పాముతో కాటేయించి..!

24 May, 2020 18:28 IST|Sakshi

తిరువనంతపురం: నిండు నూరేళ్లు భార్యతో కాపురం చేయాల్సిన భర్త అదనపు కట్నం కోసం పాముతో కాటేయించి చంపిన ఘటన కేరళలో జరిగింది.  ఉతారా గదిలో ఘటన జరిగిన రోజున తలుపులు, కిటికీలు అన్ని మూసి ఉండటం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పాముకాటుకు గురవ్వడంపై కుటుంబ సభ్యులకు అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్‌ విచారించగా తనకేమీ తెలియదని చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో చివరకు నిజాన్ని ఒప్పుకున్నాడు.

వివరాల్లోకెళ్తే.. కొల్లం జిల్లా అంచల్‌కు చెందిన సూరజ్ ఓ ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి. అతనికి ఉతారాతో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఏడాదిన్నర పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో గత కొద్ది రోజులుగా కలతలు మొదలయ్యాయి. సూరజ్‌ భార్యపై వరకట్న వేదింపులకు దిగాడు. ఉతారా కుటుంబం ఆర్థికంగా ఎటువంటి భరోసా ఇచ్చే దారి కపిపించకపోవడంతో తనను హత్యచేసి ఆ నేరాన్ని తనపైకి రాకుండా ఉండాలని ఆలోచించి ఓ పథకం వేశాడు. వెంటనే పథకాన్ని అమలు చేయాలని భావించి తనకు తెలిసిన సురేష్‌ అనే పాములు పట్టే వ్యక్తిని సంప్రదించి రెండు పాములను రూ. 10,000లకు కొన్నాడు. ఉతారా ఓ రోజు గదిలో నిద్రపోతుండగా పామును ఆమెపైకి వదిలగా అది కాటు వేసింది. ఆమె వెంటనే తేరుకొని చుట్టుప్రక్కల వారి సాయంతో ఆసుపత్రికి చేరుకొని ప్రాణాలతో బయటపడింది. చదవండి: రూ.2 వేల కోసం బావమరిదిని హత్య

ఆ తర్వాత మరోసారి మే 7న సూరజ్‌ నిద్రపోతున్న ఉతారాపై మరోసారి పామును వదిలాడు. ఈసారి పాముకాటుకు ఉతారా ప్రాణాలు కోల్పోయింది. సూరజ్ మాత్రం‌ తనకేమీ ఎరగనట్లు పామును చంపి ఇంట్లోనే ఉంటున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానంపై కలిగిన ఉతారా తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణలో వ్యవహారం మొత్తం బయటపడింది. 

చదవండి: గొర్రెకుంట మృతుల కేసులో కొత్త ట్విస్ట్.. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా