వివాహేతర సంబంధం.. పాముకాటుతో..

9 Jan, 2020 17:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌ : రాజస్తాన్ లో దారుణం జరిగింది. ఒక మహిళ తన అత్తని పాము కాటుతో చంపిన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్తాన్‌లోని జున్ జున్ జిల్లాలోని ఒక గ్రామంలో గతేడాది జూన్‌2న జరుగగా... నిందితులను ఈనెల(జనవరి) 4న అరెస్ట్‌ చేశారు. వివరాలు.. రాజస్తానన్‌లోని జునుజ్జును జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సుబోధ్ దేవి కోడలు అల్పనాతో కలిసి నివాసం ఉంటుంది. అల్పనా భర్త, సచిన్ భారత సైన్యంలో పని చేస్తున్నారు. దీంతో ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నారు. సుబోధ్ దేవి భర్త రాజేష్ కూడా ఉద్యోగ రిత్యా కుటుంబానికి దూరంగా ఉన్నారు.

కాగా, అల్పనాకు జైపూర్‌కు చెందిన మనీష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారు పదే పదే ఫోన్లు మాట్లాడుకోవడం గమనించిన సుబోధ్ దేవి.. కోడలు అల్పనాను మందలించింది. అయితే తన వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందో అని భయపడినా అల్పనా.. అత్తను చంపాలని కుట్ర పన్నింది. ప్రియుడు మనీష్‌తో కలిసి ఎవరూ ఊహించని విధంగా అత్త సుబోధ్‌ దేవిని హత్య చేసేందుకు ప్లాన్‌ చేసింది. జూన్ 2, 2019 న వారు సుబోధ్ దేవిని పాము కాటుతో చంపారు.

అయితే, ఆమె మరణించిన నెలన్నర తరువాత, అల్పానా అత్త తరుపు బంధువులకు ఆమెపై అనుమానం వచ్చింది. సుబోధ్‌ దేవిని అల్పనానే హత్య చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బలమైన సాక్ష్యాలను కూడా అందించారు. అల్పనా, మనీష్‌ మాట్లాడుతుకున్న ఫోన్‌ నంబర్లను కూడా పోలీసులకు ఇచ్చారు. హత్య జరిగిన రోజు రెండు నంబర్ల మధ్య 124 కాల్స్‌, అల్పనా, మనీష్‌ స్నేహితుడు కృష్ణ కుమార్‌ మధ్య 19 కాల్స్‌ వచ్చాయి. కొన్ని మెసేజ్‌లు కూడా ముగ్గురి మధ్య షేర్‌ అయ్యాయి. విచారణ చేపట్టిన పోలీసులు.. అల్పనా, మనీష్‌తో పాటు కృష్ణ కుమార్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా