భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం 

30 Dec, 2019 09:21 IST|Sakshi
ప్రమాద స్థలంలో రోజా మృతదేహం (ఇన్‌సెట్‌లో) రోజా (ఫైల్‌)

వన భోజనాలకు వెళ్లి  వస్తుండగా ఘటన.. మోపెడ్‌ను ఢీకొన్న కంటైనర్‌  

కంచిలి: భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం చెందిన ఘటన మండలంలోని జాడుపూడి కాలనీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. కవిటి మండలం కాజూరు గ్రామానికి చెందిన బందరు రోజా (46) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త మోహన్‌రావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కాజూరు గ్రామానికి చెందిన బందరు మోహన్‌రావు, భార్య రోజా తమ సామాజిక వర్గానికి చెందిన వనభోజనాలను సోంపేట మండలం ఎకవూరు సముద్రపు తీరం వద్ద ఆదివారం ఏర్పాటు చేయడంతో వెళ్లారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత వీరి కుమారుడు హరీష్‌ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఇంటికి వెళ్లిపోయాడు. మోపెడ్‌పై మోహన్‌రావు, రోజా తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. జాడుపూడి కాలనీ వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న కంటైనర్‌ మోపెడ్‌ హ్యాండిల్‌కు రాసుకొని వెళ్లింది. దీంతో మోపెడ్‌ అదుపుతప్పి భార్యాభర్తలు రోడ్డుపై పడిపోయారు.

రోజా తలపై నుంచి లారీ(కంటైనర్‌) వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మోహన్‌రావు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. మోహన్‌రావు హెల్మెట్‌ ధరించడంతో తలకు గాయాలు కాలేదు. కంటైనర్‌ ఆపకుండా వెళ్లిపోవడంతో హైవే పోలీసులు కొజ్జిరి జంక్షన్‌ వద్ద పట్టుకొన్నారు. క్షతగాత్రుడు మోహన్‌రావు కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తె ధనలక్షి్మకి వివాహం చేశారు. కుమారుడు హరీష్‌ చదువు పూర్తిచేసుకొని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. రోజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త మోహన్‌రావుకు ఈ ఆస్పత్రిలోనే చికిత్స చేయించారు. మోహన్‌రావు ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ సి.హెచ్‌.దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌ : మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ప్రేమ పేరుతో ఎన్‌ఆర్‌ఐ వేధింపులు

కరోనా భయం: వరుస ఆత్మహత్యలు

డాక్ట‌ర్ల‌పై ఉమ్మివేసిన‌వారి అరెస్ట్‌

లాక్‌డౌన్‌: మహిళను కాల్చి చంపిన జవాను!

సినిమా

కరోనా : బాలయ్య విరాళం.. చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..

గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

‘నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో’

లాక్‌డౌన్‌: ఇంట్లో మలైకా ఏం చేస్తుందంటే!