భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి యావజ్జీవం

13 Oct, 2018 19:53 IST|Sakshi

ముజ్జాఫర్‌నగర్‌ : ఇటీవల ప్రియుడి మోజులో పడి భార్యలు, తమ భర్తలను కడతేర్చుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనలకు పాల్పడిన వారికి కోర్టులు జైలు శిక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ముజ్జాఫర్‌నగర్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. భర్త వారి అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించినందుకు గాను, వీరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి రవిందర్‌ కుమార్‌ శుక్రవారం సాయంత్రం వీరికి ఈ శిక్ష విధించారు. అంతేకాక రహీస, ఆమె ప్రేమికుడు రిజ్వాన్‌కు రూ.7000 చొప్పున జరిమానా కూడా విధిస్తున్నట్టు ప్రకటించారు.

ఐపీఎస్‌ సెక్షన్లు 302(హత్యానేరం), 201(సాక్ష్యాలు కనుమరుగు చేయడం) కింద ఈ శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్‌ ప్రకారం, రహీస, ప్రియుడి రిజ్వాన్‌తో కలిసి తన భర్త షానవాజ్‌ను 2010 జూన్‌ 15న హతమార్చింది. ఆ తర్వాత సాక్ష్యాలను కనుమరుగు చేసింది. షానవాజ్‌ దుకాణదారుడు. రహీస, రిజ్వాన్‌ల అక్రమ సంబంధాన్ని అతను వ్యతిరేకించాడు. షానవాజ్‌ హత్యపై అతని తమ్ముడు ఇస్లామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ అనంతరం ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం