మత్తుమందు ఇచ్చి ఉద్యోగినిపై అత్యాచారం

19 Feb, 2019 08:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

న్యూఢిల్లీ: తన కంపెనీలో పనిచిచేసే ఇద్దరు ఉద్యోగులు తనపై సామూహిక అత్యాచారం జరిపారని బహుళ జాతి కంపెనీలో పనిచేసే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరినప్పుడు సహోద్యోగులు ఇద్దరు తనకు కారులో లిఫ్టు ఇచ్చినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. కారులో తనకు పానీయాన్ని ఇచ్చారని, దానిని తాగి తాను స్పృహ కోల్పోయానని ఆమె తెలిపింది. పానీయంలో మత్తు మందు కలిపారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వారిద్దరు తనపై వంతులవారీగా అత్యాచారం జరిపి, వసంత్‌కుంజ్‌లో ఓ చోట తనను వదిలి వెళ్లారని ఆమె తెలిపింది. తాను ఎలాగోలా ద్వారకాలో ఉన్న ఇంటికి చేరి పోలీసు కంట్రోల్‌ రూముకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినట్లు మహిళ తెలిపింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేçసు నమోదు చేసి వైద్య పరీక్ష అనంతరం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు