మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై

2 Nov, 2019 16:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అత్యాచార పర్వాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి ఘటనల్లో పోలీసులు సైతం కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో మృగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాలు... చిత్రకూట్‌ జిల్లా మావోకు చెందిన ఓ మహిళ సోమవారం తన కుటుంబ సభ్యుడితో కలిసి బంధువుల ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలో ఆరుగురు గుర్తుతెలియని దుండగులు వాళ్లిద్దరినీ అడ్డగించారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి.. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా ఈ తతంగాన్నంతా వీడియో తీస్తూ రాక్షసత్వం ప్రదర్శించారు. దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో ఘటన జరిగిన మరుసటి రోజు బాధితురాలు పోలీసు స్టేషనుకు వెళ్లి తన గోడును వెళ్లబోసుకోగా.. పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆమె జిల్లా ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరింది. ఈ క్రమంలో ఈ ఘటనపై ఎస్పీ ఆరా తీయగా బాధితురాలు చెప్పింది నిజమేనని తేలింది. ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా వీడియో వైరలయ్యేంత వరకు పోలీసులు తన మాట నమ్మలేదని.. వారి అలసత్వం కారణంగానే నిందితులు పారిపోయారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు