వీడిన హత్యకేసు మిస్టరీ

29 Oct, 2018 13:19 IST|Sakshi
గుణ్ణంపల్లి వద్ద పోలవరం కాలువ సమీపంలో లభ్యమైన పద్మిని మృతదేహం (ఫైల్‌), పద్మిని (అంతరచిత్రం)

పశ్చిమగోదావరి, దెందులూరు: గుర్తుతెలియని మహిళ హత్యకేసును ఎట్టకేలకు ద్వారకాతిరుమల ఎస్సై వీర్రాజు చేధిం చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఆదివారం హత్య కేసుగా మార్చారు. వివరాలిలా ఉన్నాయి.. దెందులూరు మండలం పోతునూరుకి చెందిన లింగాల రవీంద్రనాథ్‌ ఠాగూర్, పద్మిని (30)కి పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పెయింటర్, ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు.

ఈనేపథ్యంలో ఈనెల 22న కూలీ పనికి వెళ్లిన పద్మిని ఇంటికి తిరిగిరాలేదు. 26న గుర్తుతెలియని మహిళ మృతదేహం ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో పోలవరం కా లువ సమీపంలో కనిపించడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్, కుటుంబసభ్యులు గుర్తు తెలియని మృతదేహాన్ని పరిశీలించి పద్మినిగా గుర్తించారు. పోతునూరు గ్రామానికి చెందిన తలారి రాజ్‌కుమార్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఠాగూర్‌ ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భీమడోలు సీఐ బి.నాగేశ్వర్‌ నాయక్‌ సహాయంతో ద్వారకాతిరుమల ఎస్సై వీర్రాజు అనుమానితుడు రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీ సుకుని విచారిస్తున్నారు. ఆదివారం పద్మిని మృతదేహానికి ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం ని ర్వహించారు.

మరిన్ని వార్తలు