అనుమానమే.. పెనుభూతమై!

23 Dec, 2017 10:15 IST|Sakshi

వేటపాలెంలో లక్ష్మీమణితేజ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ప్రధాన నిందితుడితో పాటు కుటుంబ సభ్యుల అరెస్టు 

సాక్షి, చీరాల రూరల్‌: చిన్న నాటు నుంచి వారిద్దరు స్నేహితులు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇంతో అనుమానం పెనుభూతమై యువతి హత్యకు దారి తీసింది. చిన్ననాటి స్నేహాన్ని సైతం మరచిన అతడు ఆమెను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి మంచానికి కట్టేసి అత్యంత పాశవికంగా గొంతుకోసి చంపాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి కొత్తపేటలోని తన కార్యాలయంలో డీఎస్పీ డాక్టర్‌ ప్రేమ్‌ కాజల్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం..
వేటపాలెం జీవరక్ష నగర్‌కు చెందిన వల్లెపు గోపీచంద్‌, పాత చీరాలకు చెందిన శవనం లక్ష్మీమణితేజ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఆ పరిచయం ప్రేమగా మారింది. మణితేజ ఎంటెక్‌ చదువుతూ చీరాలలోని టీవీఎస్‌ షోరూంలో పనిచేస్తుండగా గోపిచంద్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెను అనుమానించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తన ఆలోచనలను తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లెళ్లతో పంచుకున్నాడు. అందరూ కలిసి ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం రామానగర్‌లోని అతని మేనమామ ఇంట్లో ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు. ఆమెను రామానగర్‌ తీసుకెళ్లాడు. తొలుత ఆమెపై లైంగిక దాడి చేసి అనంతరం రెండు చేతులూ మంచానికి కట్టేసి అత్యంత పాశవికంగా పీక కోసి హతమార్చాడు. ఆమె శరీరంపై ఉన్న బంగారు చైను, ఉంగరం, గాజులతో పరారయ్యాడు. గోపిచంద్‌తో అక్కడి నుంచి తల్లిదండ్రులు జ్యోతి, శ్రీనివాసరావు, చెల్లెళ్లు లావణ్య, జ్యోత్స్నలను తీసుకుని ముందుగా బాపట్ల Ððవెళ్లాడు. అక్కడి నుంచి కర్ణాటక రాష్టంలోని బీదర్, హుబ్లీ అనేక ప్రాంతాల్లో తిరిగి పేర్లు మార్చుకుని వివిధ రకాల పనుల్లో నిమగ్నమయ్యారు. మూడు నెలలుగా పోలీసులు బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితులను అదుపులోకి తీసుకుని కేసును ఛేదించారు. మృతురాలి వద్ద తీసుకెళ్లిన బంగారు ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి, వేటపాలెం ఎస్‌ఐ వెంకట కృష్ణయ్య, ఏఎస్‌ఐలు శ్రీనివాసరావు, ప్రసాద్, కానిస్టేబుళ్లు, హోంగార్డులకు ఎస్పీ రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ ప్రేమ్‌కాజల్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు