అటవీ ప్రాంతంలో దారుణం.. మహిళ తలపై..

21 Apr, 2019 08:14 IST|Sakshi

క్రిష్ణగిరి : సూళగిరి  అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని మహిళను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహంపై బండరాళ్లు వేసి ఉడాయించారు. ఈ ఘటన  శనివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సూళగిరి తాలూకా మేలుమలై సమీపంలోని బాలకొండరాయనదుర్గం వద్ద  మహిళ హత్యకు గురైనట్లు తెలుసుకున్న స్థానికులు సూళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  శనివారం  డీఎస్పీ మీనాక్షి, పోలీసులు  సంఘటనా స్థలానికెళ్లి  పరిశీలించారు. హతురాలి ముఖం కనిపించకుండా కొండపై ఉన్న నీటి గుంతలోకి వేసి తలపై బండరాళ్లు వేసి ఉండగా వాటిని తొలగించారు. మృతదేహాన్ని పక్కకు తీసి పరిశీలించగా ఆమె వయస్సు 25నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని అంచనాకు వచ్చారు.

తలపై బలమైన గాయాలుండటంతో రాళ్లతోమోది హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఎవరనేది తెలియరాలేదు. ఎడమచేతిపై పచ్చబొట్టు ఉండగా వేలికి ఉంగరం ఉంది. ధరించిన దుస్తులను బట్టి మృతురాలు విద్యావంతురాలు అని తెలుస్తోంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దుంగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారా? లేక ఇతర కారణాలతో హత్యకు గురైందా? అనేది దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముఖం చాటేసిన పోలీస్‌ భర్త

దారుణం: భార్యాభర్తల గొడవలో తలదూర్చినందుకు..

33 మందిపై పిచ్చికుక్క దాడి

62 మంది విద్యార్థులకు అస్వస్థత

అత్తగారింటికి వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

కట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కానిస్టేబుల్‌ దుర్మరణం

బిగ్‌బాస్‌ ప్రతినిధులపై శ్వేతరెడ్డి ఫిర్యాదు

హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

పెళ్లి చేసుకుని మొహం చాటేశాడు..

గోదావరిలో యువకుడు గల్లంతు

బుల్లెట్‌ దిగితే గాని మాట వినరు!

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై మూకదాడి..!

అనుమానాస్పదంగా యువకుడి హత్య

దశావతారాల్లో దోపిడీలు

రాయగడ పోలీస్‌స్టేషన్‌పై రాళ్ల దాడి

వివాహేతర సంబంధాలపై నిలదీస్తోందని...!

యువతిపై వృద్ధుడి లైంగిక వేధింపులు

దారుణం : చిన్నారి చేతుల్ని విరిచేసిన కిడ్నాపర్‌..!

చెప్పుల్లో దాచాడు.. చిక్కుల్లో పడ్డాడు

డయల్‌ 100తో బతికిపోయింది. కానీ..

క్రికెట్‌పై పిచ్చితో.. తాత ఇంటికే కన్నం

ఇంటర్‌ బాలికపై అత్యాచారం

వేధింపులు.. ఇంటర్‌ విద్యార్థిని సూసైడ్‌..!

‘సాయం చేయండి.. ఊపిరాడటం లేదు’

దయచేసి హాస్టల్స్‌లో ఒంటరిగా ఉండొద్దు..!

మదరసాలో కీచకపర్వం

బడి ఉంటే బతికేటోళ్లు బిడ్డా..

‘కోడెల కాటు’ బాధితులెందరో!

భార్య విడాకులు తీసుకుందన్న కోపంతో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు