చిన్నారిపై వేడినీళ్లు పోసిన మహిళ

20 Mar, 2018 02:11 IST|Sakshi

ఖమ్మం క్రైం: ఖమ్మం నగరంలో ఓ చిన్నారిపై పొరుగింటి మహిళ వేడినీళ్లు పోసిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. తుమ్మలగడ్డ ప్రాంతానికి చెందిన ఆసిఫ్‌ చికెన్‌ దుకాణంలో పనిచేస్తూ భార్య షమీమ్, కుమారుడు హఫీజ్‌ (5)తో కలసి జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి హఫీజ్‌ తమ ఇంటి పక్కనే ఉన్న బంధువు అయిన నసీమా అనే మహిళ ఇంట్లో ఆమె కూతురితో కలసి ఆడుకోవడానికి వెళ్లాడు. గంట తర్వాత నసీమా వచ్చి ‘మీ అబ్బాయి ఆడుకుంటుండగా..స్టౌ మీద ఉన్న వేడినీటి గిన్నె మీద పడింది..’అని చెప్పింది.

బాలుడి తల్లి షమీమ్‌ వెళ్లిచూడగా అప్పటికే హఫీజ్‌ వీపు కాలి, స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోమవారం రాత్రి స్పృహలోకి వచ్చిన బాలుడు తన మీద నసీమా వేడినీళ్లు పోసిందని, వద్దని ఏడుస్తున్నా బలవంతగా పట్టుకొని పోసిందని చెప్పగా బాలుడి తల్లిదండ్రులు దీనిపై నసీమాను నిలదీశారు. ఆమె వాగ్వాదానికి దిగడంతో వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కువచ్చి సీఐ రమేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై సురేశ్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు