భర్త ఇంటి ముందు వివాహిత నిరసన 

20 Aug, 2019 10:26 IST|Sakshi
నిరసన తెలుపుతున్న వివాహిత

సాక్షి, ఖమ్మం(సత్తుపల్లిటౌన్‌) : మాయమాటలు చెప్పి ప్రేమపెళ్లి చేసుకొని ఉడాయించాడని ఓ మహిళ భర్త ఇంటి ముందు నిరసన దీక్షకు దిగిన సంఘటన సత్తుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామానికి చెందిన బాణోతు పద్మజ 2017లో సత్తుపల్లిలో ఇంటర్‌ చదివేటప్పుడు.. సత్తుపల్లిలోని శ్రీనివాసా టాకీస్‌రోడ్‌లోని షేక్‌ ఖుర్షీద్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. హైదరాబాద్‌లో చదువుకునేందుకు వెళ్లి ఇరువురు కలిసి తిరిగారు. రెండేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పద్మజను మతమార్పిడి చేయించాడు. ఇరువైపుల పెద్దలకు తెలియకుండానే హైదరాబాద్‌లోని మోతినగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు.

పెళ్లి తరువాత కొన్నిరోజులు హాస్టల్‌లో ఉండమని చెప్పి.. కాపురం పెట్టేందుకు ఆమె వద్ద నుంచి పొలం అమ్ముకొని వచ్చిన రూ.15 లక్షలను తీసుకొని సత్తుపల్లి వచ్చాడు. ఆ తర్వాత ఆమె ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించటం లేదని వాపోయింది. మతం మారటంతో తన కుటుంబ సభ్యులు కూడా తనను ఇంటికి రానివ్వటంలేదని కన్నీళ్లు పెట్టింది. దీంతో సోమవారం నేరుగా సత్తుపల్లిలోని అతని ఇంటికి వచ్చింది. దీంతో ఖుర్షీద్‌ కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదంటూ దూషించటంతో ఆమె ఇంటి ముందే నిరసనకు దిగింది. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.సురేష్‌ తెలిపారు.  
     

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కిడ్నాపర్‌ను పట్టుకున్న గ్రామస్తులు

పోలీసుల అదుపులో టీడీపీ ‘కీ’ లేడీ

అత్తను హత్య చేసిన కోడలి అరెస్ట్‌

ప్రియునితో కలిసి తండ్రిని హతమార్చిన బాలిక

పెళ్లయిన మూడు నెలలకే.. 

నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు

దొంగగా మారిన రైల్వే కూలీ

ఏసీబీ వలలో జీఎంసీ బిల్‌ కలెక్టర్‌

ప్రియురాలితో తాజ్‌మహల్‌ చూడాలనుకుని..

చిన్నారిపై పాఠశాల కరస్పాండెంట్‌ పైశాచికత్వం

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు

ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి.. కిరోసిన్‌ పోసి..

బాత్రూంలో బంధీగా చిన్నారి ; చివరికి

వీడెంత దుర్మార్గుడో చూడండి

కారు బీభత్సం : రెండుకు చేరిన మృతుల సంఖ్య

మూటలో మంజుల... ఫ్రిజ్‌లో ‘సిరిసిల్ల’ శ్రీనివాస్‌...

ఐస్‌ క్రీమ్‌ కోసం గొడవ.. ప్రియుడ్ని కత్తెరతో..

గంజాయి కావాలా నాయనా..!

ఇంట్లో చొరబడి కత్తితో బెదిరించి..

ప్రమాదం.. ఆగ్రహం

ఆటకు రూ.500!

రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీ ఉద్యోగి మృతి

‘ఫ్యాన్సీ’ గా అక్రమ సిగరెట్ల వ్యాపారం

టూరిస్ట్‌ వీసాలపై గల్ఫ్‌ దేశాలకు..

టీడీపీ నాయకులపై కేసు నమోదు

ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు : షాకింగ్‌ వీడియో

‘నా తల్లిదండ్రులే వ్యభిచారం చేయిస్తున్నారు’

ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది దుర్మరణం

మంత్రి కాన్వాయ్‌ ఢీకొందని తప్పుడు పోస్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ప్రమాదం..!

కొత్త జోడీ

ప్రేమలో పడితే..!

మా సభ్యులకు అవకాశాలివ్వాలి

తొమ్మిది గంటల్లో...

సంక్రాంతి బరిలో మంచోడు