60యేళ్ల వృద్ధురాలిపై ఇంత దారుణమా

13 Dec, 2019 09:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోలకతా :  దేశంలో మహిళలపై హింసకు, దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. దక్షిణ కోల్‌కతాలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 60 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన కలకలం రేపింది.  ఆమెను కత్తితో పొడిచిచంపడంతోపాటు తలను నరికిశారు. పొట్టను చీల్చి వేశారు. ఇంత దారుణానికి ఎవరు, ఎందుకు పాల్పడ్డారో అంచనా వేయలేక పోలీసులు సైతం తలలు పట్టుకున్నారు. 

గురువారం జరిగిన ఈ ఘటనలో చనిపోయిన మహిళను పంజాబ్‌కు ఊర్మిళ కుమారిగా గుర్తించారు.  తన ఇద్దరు కొడుకులతో గత కొన్నాళ్లుగా కోలకతాలో నివసిస్తోంది. కుమారులు ఇద్దరు  వివాహానికి హాజరయ్యేందుకు వేరే నగరానికి వెళ్లారు. దీంతో ఆమె రెండు రోజులుగా ఒంటరిగానే వుంటోంది.  ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని భావిస్తున్నారు.  శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. తలను వేరు చేయడంతోపాటు, పొత్తి కడుపును చీల్చివేశారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఆమె శరీరంపై బంగారం ఆభరణాలు, ఇంట్లోని నగదు అలానే ఉన్నాయనీ, దీంతో పగతో చేసిన హత్యగానే ప్రాథమికంగా భావిస్తున్నామని జాయింట్‌  పోలీసు కమిషనర్ (క్రైమ్) మురళీధర శర్మ అన్నారు. అయితే విలువైన వస్తువులు ఏమైనా  మాయమయ్యాలేదా అనేది ఇపుడే నిర్ధారించలేమని  శర్మ తెలిపారు.  బాధితురాలి కుమారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని, అన్ని  కోణాల్లో దర్యాప్తు సాగుతుందని వెల్లడించారు.

అయితే ఊర్మిళ నివాసానికి సమీపంలోనే మద్యం దుకాణం ఉండేదనీ, దీంతో అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పలుసార్లు ఆమె గారియాహాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని స్థానికులు చెప్పారు. ఆ కక్షతోనే  ఈదారుణానికి  ఒడిగట్టి వుంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా