ఐటీ సిటీలో మహిళపై అరాచకం..

5 Apr, 2019 13:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూర్‌ : మహిళను అత్తింటి వారు దారుణంగా వెంటాడి, అత్యంత క్రూరంగా హింసించిన ఘటన ఐటీ సిటీ బెంగళూర్‌లోని కమ్మనహళ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. మహిళను నడిరోడ్డుపై ఆమె మరిది సహా అతడి కుటుంబ సభ్యులు రాళ్లతో, చెప్పులతో కొట్టడంతో పాటు దుస్తులను లాగి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించడంతో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. తనపై దాడికి తెగబడిన మరిది, అతని కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బాధితురాలు బనస్‌వాడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాధితురాలి భర్త ఈ ఏడాది జనవరిలో మరణించగా ఇద్దరు కుమార్తెలతో కలిసి మరిది ఇతర కుటుంబ సభ్యులతో బనస్‌వాడిలోని మెట్టినింట్లో నివసిస్తోంది. కాగా ఆమె ప్రవర్తనను నిందిస్తూ ఆడపడుచు ప్రమీల ఇటీవల బాధితురాలితో ఘర్షణకు దిగింది. ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటోందని నిందిస్తూ బాధితురాలిని ఇంటి నుంచి వెళ్లాలని ఆమెపై చెప్పులు, రాళ్లు విసిరేసింది.

తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తింటి వారు మరింత రెచ్చిపోయారని బాధితురాలు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ తనపై కత్తితో దాడి చేసేందుకు ప్రమీల దూసుకొచ్చిందని, కొంతసేపటికి ఆమె భర్త సతీష్‌, కుమార్తె సైతం తనపై దాడి చేశారని, వారు తన దుస్తులు లాగేసి తీవ్రంగా కొట్టారని చెప్పారు. ఈ దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేసిన తన కుమార్తెను సైతం వారు గాయపరిచారని తెలిపారు. కాగా బాధితురాలి ఫిర్యాదుపై సతీష్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమ్మను వేధిస్తే.. అంతే! 

భర్త హత్య కేసులో భార్యే నిందితురాలు

హెచ్‌సీయూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఎన్నారై అనుమానాస్పద మృతి

అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

మలేషియా జైల్లో మనోళ్లు బందీ

అవమానాలు భరించ లేకున్నా.. వెళ్లిపోతున్నా..

మత్తులో కత్తులతో వీరంగం!

మోసగాడు.. ఇలా దొరికాడు

ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..

ప్రేమ జంటలే టార్గెట్‌

‘ఆ ఊహనే భరించలేకున్నా.. చనిపోతున్నా’

వివాహేతర సంబంధమా.. వ్యాపారుల మధ్య పోటీయా..?

ట్రాక్టర్‌ డ్రైవర్‌ దారుణహత్య

హిజ్రా చంద్రముఖి ఫిర్యాదు..

వందల కోట్లు లంచంగా ఇచ్చా

భర్త, కుమారుడిని వదిలేసి సహజీవనం.. ఆత్మహత్య

బాలికపై సామూహిక లైంగికదాడి

ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం

కుప్పంలో దొంగనోట్ల ముఠా!

ఎంపీ గల్లా అనుచరులపై కేసు

అనసూయ పేరుతో అభ్యంతరకర పోస్టులు

ప్రేమ వ్యవహారమేనా..?

సౌదీలో పరిచయం.. తమిళనాడులో సంబంధం

బ్యూటీషియన్‌ దారుణ హత్య

అమెరికాలో పూజారిపై దాడి

హైదరాబాద్‌కు ఐసిస్‌ నమూనాలు!

ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై మరో కేసు

షేక్ సద్దాంను హత్య చేసిన నిందితుల అరెస్ట్‌

ఉపాధ్యాయుల ఇళ్లలో భారీ చోరీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ