అదృశ్యమైన యువతి ట్యాంక్‌బండ్‌లో శవమై..

10 Dec, 2019 08:07 IST|Sakshi

సాక్షి, అడ్డగుట్ట : తుకారాంగేట్‌లో అదృశ్యమైన యువతి హుస్సేన్‌ సాగర్‌లో శవమై తేలింది. గాంధీ మార్చురీలో భద్రపరిచిన యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఆలస్యంగా గుర్తించడంతో వారికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే  బుద్ధానగర్‌కు చెందిన అంజయ్య కుమార్తె రాణి(18) వెస్ట్‌మారేడ్‌పల్లిలోని వెస్లీ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. గత నెల 21న కాలేజీకి వెళ్లిన రాణి తిరిగి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా  ఫలితం లేకపోవడంతో గత నెల 22న తుకారాంగేట్‌ పోలీస్‌స్టేసన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.   

23న హుస్సేన్‌ సాగర్‌లో మృతదేహం.... 
హుస్సేన్‌ సాగర్‌లో 23న గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం రాంగోపాల్‌పేట్‌ పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భద్రపరిచారు. మరుసటిరోజు పేపర్‌లో వార్త చూసిన తుకారాంగేట్‌ పోలీసులు ఆమె కుటుంబసభ్యులను మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించారు. అయితే మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండడంతో వారు గుర్తు పట్టలేకపోయారు. అయితే, రోజులు గడుస్తున్నా మృతురాలి ఆచూకీ తెలియకపోవడంతో మరోసారి మృతదేహాన్ని పరిశీలించాలని పోలీసులు అంజయ్య కుటుంబ సభ్యులకు సూచించారు. సోమవారం గాంధీ మార్చురీకి వచి్చన వారు పుట్టు మచ్చలు, పట్టీల ఆధారంగా మృతురాలు రాణిగా గుర్తించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.  

రాణి మృతదేహం.. రాణి(ఫైల్‌)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా