మోసాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్‌

13 Jul, 2019 10:55 IST|Sakshi
నిందితురాలు ప్రేమలత

చందానగర్‌: డబుల్‌ బెడ్‌ రూం ఇల్ల నిర్మాణానికి లోన్లు, సబ్సిడీపై రుణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న మహిళను చందానగర్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శేరిలింగంపల్లి, పాపిరెడ్డి కాలనీకి చెందిన ధర్మన ప్రేమలత తనకు పరిచయస్తుడైన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి సెక్రెటరియేట్‌లో పనిచేస్తున్నాడని, అతడి సహకారంతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు మంజూరు చేయిస్తానని, రుణాలు ఇప్పిస్తానని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాల పేరుతో 2016లో ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో 35 మంది నుంచి రూ. 25 వేల నుంచి రూ. 30 వేల చొప్పున వసూలు చేసింది.

అయితే ఇప్పటి వరకు ఎలాంటి లోన్లు, ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు ప్రేమలతపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె పరారైంది. దీంతో బాధితులు ఈ నెల 9న చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం పాపిరెడ్డి కాలనీలో మాటు వేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించింది. రూ.6.50లక్షలు వసూలు చేశానని, శ్రీనివాస్‌రెడ్డికి అందులో వాటా ఇచ్చినట్లు తెలిపింది. నిందితురాలిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస్‌రెడ్డిని కూడా అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు