ఫేక్‌ ప్రొఫైల్‌‌తో ఎన్నారైకి వల; మహిళ అరెస్టు

28 May, 2020 18:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఫేక్‌ ప్రొఫైల్‌‌ క్రియేట్‌ చేసి ఎన్నారైకు వల వేసి మోసం చేసిన మహిళను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన మాళవిక అనే మహిళ ఫేక్‌ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసి భారత్‌ మాట్రిమోనిలో షేర్‌ చేసి ఎన్నారైలను మోసం చేయడం టార్గెట్‌గా పెట్టుకుంది. దీనికి మాళవిక కుమారుడు ప్రణవ్‌ సహాయం చేస్తుండేవాడు. తాజాగా మాళవి​క కాలిఫోర్నియాకు చెందిన వరుణ్‌ అనే ఎన్నారైకి వల వేసి దాదాపు రూ. 65 లక్షలు వసూలు చేసింది. (ప్రియుడితో పారిపోయిందని చితకబాదారు)

తాను ఒక డాక్టర్‌నంటూ.. తనకు చాలా ఆస్తులు ఉన్నాయని పేర్కొంది. మా నాన్న చనిపోయాడని.. ఆస్తులన్నీ తన పేరు మీద రాయాలని తన తల్లి హింసిస్తున్నట్లు తెలిపింది. ఆస్తులను కాపాడుకోవడానికి తన తల్లిపై లీగల్‌గా ఫైట్‌ చేయడానికి తనకు సహాయం చేయాలని కోరింది. పరిస్థితి చక్కబడిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటానని.. అప్పుడు తన ఆస్తులన్నింటికి యాజమాని అవుతావంటూ మాయ మాటలు చెప్పింది. మాళవిక చెప్పినవన్నీ నిజమేనని నమ్మిన వరుణ్‌ ఆమె అకౌంట్‌లోకి రూ. 65 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అనంతరం పెళ్లి విషయమై మాళవిక నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన వరుణ్‌ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాళవికతో పాటు ఆమె కొడుకు ప్రణవ్‌ను అరెస్టు చేశారు. కాగా గతంలోనూ మాళవిక తన భర్త, అత్తతో కలిసి ఇదే విధంగా ఓ ఎన్నారైను మోసం చేసినందుకు కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. (ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..)

మరిన్ని వార్తలు