దారుణం : హత్య చేసి శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు

30 Apr, 2020 12:31 IST|Sakshi
మృతురాలు సుచిత్ర, నిందితుడు ప్రశాంత్‌

పాలక్కడ్‌ : తనను నమ్మి వచ్చిన ఒక మహిళను మోసగించడమే కాకుండా ఆమెను దారుణంగా చంపి తన ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన కేరళలోని పాలక్కడ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కొల్లామ్‌ జిల్లాకు చెందిన 42 ఏళ్ల సుచిత్ర అనే మహిళ కొట్టాయంలో ట్రైనీ బ్యుటిషియన్‌గా విధులు నిర్వహిస్తోంది. కాగా మార్చి 17న తన మామయ్యకు బాగా లేదని, తాను వెంటనే అలప్పుజాకు వెళ్లి ఆయనను చూసుకోవాల్సి ఉందని తనకు సెలవు కావాలని కంపెనీకి మెయిల్‌ చేసింది. తర్వాతి రోజు మరో ఐదు రోజులు సెలవులు పొడిగించాలంటూ మళ్లీ మెయిల్‌ చేసింది. అప్పటికే ఇంటికి చేరుకున్న సుచిత్ర తనను ట్రైనింగ్‌ పని మీద ఎర్నాకుళం పంపిస్తున్నారని ఇంట్లో వాళ్లతో చెప్పి వెళ్లింది. ఐదు రోజులైనా సుచిత్ర ఒక్కసారి కూడా ఫోన్‌ చేయకపోవడంతో అనుమానుమొచ్చి సుచిత్ర పని చేస్తున్న సంస్థకు ఫోన్‌ చేయగా ఇక్కడికి రాలేదని, తాను వాళ్ల మామయ్యకు బాగా లేదని చెప్పి ఐదు రోజులు సెలవు తీసుకుందని పేర్కొన్నారు. దీంతో వెంటనే కొట్టాయం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కుటుంబసభ్యులు సుచిత్రపై మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.  సుచిత్ర తన భర్తతో విడాకులు తీసుకొని భర్త తరపు కుటుంబసభ్యులకు దూరంగా ఉంటుందని పోలీసులకు వెళ్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
(వ్యక్తి ప్రాణం తీసిన కోడి ధర)

మనాలీకి చెందిన కీబోర్డ్‌ ప్లేయర్‌ 32 ఏళ్ల ప్రశాంత్‌ సోషల్‌ మీడియా ద్వారా సుచిత్రకు పరిచయమయ్యాడు. కొంతకాలంగా ప్రశాంత్‌, సుచిత్రల మధ్య ప్రేమాయణం కొనసాగుతందని దర్యాప్తులో తేలింది. ప్రశాంత్‌ను కలవడానికే సుచిత్ర మనాలీ వెళ్లిందని తేలింది. దీంతో కొల్లాయం క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు మనాలీ వెళ్లి ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. మొదట సుచిత్ర, తాను పెళ్లి విషయమై పోట్లాడుకున్నామని, తర్వాత సుచిత్ర ఆత్మహత్య చేసుకుందని ప్రశాంత్‌ తెలిపాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. గత కొంతకాలంగా సుచిత్ర తనను ప్రేమిస్తుందని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసినట్లు ప్రశాంత్‌‌ ఒప్పుకున్నాడు. తర్వాత ఆమె శవాన్ని తాను ఉంటున్న ఇంట్లోనే పాతి పెట్టానని తెలిపాడు. ప్రశాంత్‌ చెప్పిన వివరాల ప్రకారం సుచిత్ర పాతిపెట్టిన చోటును తవ్వించగా ఆమె మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభించింది.ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించగా ఆ మృతదేహం సుచిత్రదేనని తేలింది. దీంతో ప్రశాంత్‌‌ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

మరిన్ని వార్తలు