ఇళ్లు అద్దెకు కావాలని వచ్చింది.. కానీ అంతలోనే

23 Jul, 2019 11:42 IST|Sakshi
çసుశీల మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

సాక్షి, పలమనేరు(చిత్తూరు) : స్థానిక లాల్‌బహుదూర్‌ నగర్‌లో ఓ వివాహిత దారుణహత్యకు గురైన ఘటన సోమవారం పలమనేరులో సంచలనం సృష్టించింది. పలమనేరు డీఎస్పీ గిరిధర్‌ కథనం.. మండలంలోని నక్కపల్లెకు చెందిన సుశీల(48)కి ఇద్దరు పిల్లలున్నారు. ఈమె భర్త నారాయణ రెడ్డి గతంలో మృతిచెందారు. ఇలా ఉండగా ఆదివారం రాత్రి సుశీల, మరో వ్యక్తితో కలసి లాల్‌బహుదూర్‌ నగర్‌లో చెంగమ్మ ఇంటికెళ్లారు. ఇల్లు అద్దెకు కావాలని అడిగారు.

అయితే ఇల్లు అద్దెకు లేదని చెప్పడంతో వారిరువురూ రాత్రయిందని, తాము ఈ పూటకి ఇక్కడే తలదాచుకుని ఉదయాన్నే వెళతామని అక్కడి వరండాలో పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి సుశీల రక్తపు మడుగులో పడి ఉంది. ఈమె తలపై నిందితుడు బండరాయితో మోది హతమార్చినట్లు ఆనవాళ్లు బట్టి తెలుస్తోంది. ఇలా ఉండగా హత్య జరగడానికి ముందే చెంగమ్మ నిద్రించిన ఇంటితలుపుకు గడి పెట్టి∙ఉంది. ఉదయం ఆమె ఇతరులకు ఫోన్‌చేసి ఇంటిలోంచి బయటకు వచ్చిన తర్వాతే హత్యోదంతం వెలుగుచూసింది.

ఇలా హతురాలు, నిందితుడు ఇద్దరూ గతంలో పట్టణంలోని ఓ క్వార్టర్స్‌లో ఉంటూ తరచూ గొడవలు పడుతుండేవారని  స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలంలో మద్యం సీసా కూడా ఉన్నట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని పలమనేరు డీఎస్పీ, పట్టణ సీఐ శ్రీధర్‌ పరిశీలించారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాస్త పొట్టిగా ఉన్న నిందితుడు హిందీ మాట్లాడుతాడని పోలీసులు తెలుసుకున్నారు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరెంటు లేదా అంటూ వచ్చి.. కిడ్నాప్‌

చెల్లెలిపై అన్న లైంగికదాడి 

తెల్లారేసరికి విగతజీవులుగా..

వసూల్‌ రాజా.!

ప్రియుడితో పారిపోయేందుకు భర్తను...

దండుపాళ్యం ముఠా కన్నుపడితే అంతే..

ఇల్లు ఖాళీ చేయమంటే బెదిరిస్తున్నాడు 

యువకుడి దారుణ హత్య

బాత్‌రూమ్‌లో కిందపడి విద్యార్థిని మృతి

మోసం.. వస్త్ర రూపం

ఫేస్‌బుక్‌ ప్రేమ విషాదాంతం

రోడ్డు బాగుంటే పాప ప్రాణాలు దక్కేవి

సంతానం కోసం నాటు మందు.. భర్త మృతి

వాటర్‌హీటర్‌తో భర్తకు వాతలు

కలిసి బతకలేమని.. కలిసి ఆత్మహత్య

అమ్మను వేధిస్తే.. అంతే! 

భర్త హత్య కేసులో భార్యే నిందితురాలు

హెచ్‌సీయూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఎన్నారై అనుమానాస్పద మృతి

అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

మలేషియా జైల్లో మనోళ్లు బందీ

అవమానాలు భరించ లేకున్నా.. వెళ్లిపోతున్నా..

మత్తులో కత్తులతో వీరంగం!

మోసగాడు.. ఇలా దొరికాడు

ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..

ప్రేమ జంటలే టార్గెట్‌

‘ఆ ఊహనే భరించలేకున్నా.. చనిపోతున్నా’

వివాహేతర సంబంధమా.. వ్యాపారుల మధ్య పోటీయా..?

ట్రాక్టర్‌ డ్రైవర్‌ దారుణహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

పెన్‌ పెన్సిల్‌

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా