ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ మృతి

19 Jul, 2019 11:35 IST|Sakshi
రాస్తారోకో చేస్తున్న మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు 

సాక్షి, వర్ధన్నపేట (వరంగల్‌) : ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అయిన మహిళకు వైద్యం వికటించి మృతి చెందిందని ఆరోపిస్తూ గురువారం సాయంత్రం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం వరంగల్‌– ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగా రు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం సిద్ధ సముద్రంకు చెందిన దారావత్‌ దివ్య బుధవారం ప్రసవం కోసం కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆమెకు నొప్పులు రావడంతో దివ్యకు బుధవారం రాత్రి ఆపరేషన్‌ చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మరికొద్ది గంటల్లోనే రక్తస్రావం కావడంతో వెంటనే ఆమెను వైద్యులు వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

దివ్య ఎంజీఎంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిం ది. దీంతో దివ్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట, వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. దీంతో  ఇరువైపుల కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్థానిక ఎస్సై బండారి సంపత్‌ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. దీంతో వారు ఎస్సైతో వాగ్వివాదానికి దిగారు. వారికి  నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  

మరిన్ని వార్తలు