శుభకార్యానికి వెళ్తూ.. అనంతలోకాలకు  

21 Jun, 2018 13:44 IST|Sakshi
మృతిచెందిన భాగ్యమ్మ 

భర్తకు తీవ్రగాయాలు

రామడుగు(చొప్పదండి) : కరీంనగర్‌– జగిత్యాల జాతీయ రహదారిపై రామడుగు మండలం వెదిర శివారులోని గణేష్‌నగర్‌ స్టేజీ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వెదిర గ్రామానికి చెందిన రాల్లబండి భాగ్యమ్మ (65)మృతి చెందింది. అమె భర్త రాల్లబండి హన్మంతరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.

గ్రామస్తుల వివరాల ప్రకారం.. వెదిరకు చెందిన రాల్లబండి హన్మంతరెడ్డి– భాగ్యమ్మలు బుధవారం వాళ్ల కూతురి ఇంట్లో శుభకార్యం ఉండడంతో బయల్దేరారు. రోడ్డుపై నిల్చుని బస్సుకోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఆటోరాగా ఆపేందుకు ప్రయత్నించారు.

వెనకాలే వస్తున్న టిప్పర్‌ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనకాలే వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో టిప్పర్‌ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న దంపతులను ఢీకొట్టి రోడ్డు కిందకు వెళ్లిపోయింది.  తీవ్రగాయాలైన వీరిని గ్రామస్తులు కరీంనగర్‌లోని ఓ ప్రవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ భాగ్యమ్మ మృతి చెందింది. హన్మంతరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతరాలి కుమారుడు మధుసూదన్‌రెడ్డి జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. గురువారం స్వగ్రామానికి చేరుకోనున్నాడు. రామడుగు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు